Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కొత్తకోట దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాడె మోసిన చంద్రబాబు!

కొత్తకోట దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాడె మోసిన చంద్రబాబు!

  • టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి
  • చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన నేత
  • మహబూబ్ నగర్ జిల్లా పర్కాపూర్ గ్రామానికి వెళ్లిన చంద్రబాబు
  • దయాకర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళి

తెలంగాణ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూయడం తెలిసిందే. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దయాకర్ రెడ్డి తుదిశ్వాస విడిచారు.

కాగా, కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఇతర కార్యక్రమాలు రద్దు చేసుకుని మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోట దయాకర్ రెడ్డి స్వగ్రామం పర్కాపూర్ వెళ్లారు.

అక్కడ దయాకర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందంటూ వారికి ధైర్యం చెప్పారు. అనంతరం చంద్రబాబు… దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాడె మోశారు. తమ పార్టీ సహచరుడికి కడసారి వీడ్కోలు పలికారు.

Related posts

సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ విజేత పల్లా రాజేశ్వర్ రెడ్డి

Drukpadam

The Workout Plan To Get Ripped Without Breaking A Sweat

Drukpadam

కిడ్నాపర్లు ఎంపీ భార్య, కొడుకు, ఆడిటర్ ను కట్టేసి.. రూ.1.75 కోట్లను వసూలు చేశారు: డీజీపీ

Drukpadam

Leave a Comment