Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కోర్టులో ఫోన్ మోగడంతో జడ్జ్ గుస్సా.. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలికి జరిమానా…!

కోర్టులో ఫోన్ మోగడంతో జడ్జ్ గుస్సా.. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలికి జరిమానా…!

  • హనుమకొండ బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనపై కోర్టు విచారణ
  • హనుమకొండ, వరంగల్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ కోర్టులో హాజరు
  • విచారణ సందర్భంగా స్వర్ణ సెల్‌ఫోన్ మోగడంపై న్యాయమూర్తి అభ్యంతరం
  • కోర్టు ప్రశాంత వాతావరణం దెబ్బతిందంటూ ఫోన్ స్వాధీనం
  • కోర్టుకు రూ.100 జరిమానా చెల్లించి ఫోన్ వెనక్కు తెచ్చుకున్న స్వర్ణ

కోర్టులో సెల్ ఫోన్ మోగడంతో ఆగ్రహించిన న్యాయస్థానం వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణకు జరిమానా విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే, గతేడాది జులై 1న హనుమకొండలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఈ ఘటనలో అనిల్ అనే కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడటంతో సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణలతో పాటు మొత్తం 12 మందిపై హత్యాయత్నం కేసు పెట్టారు.

మంగళవారం వీరందరూ వరంగల్ జిల్లా మూడో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణకు హాజరైన సందర్భంగా స్వర్ణ సెల్‌‌ఫోన్ మోగింది. దీంతో, ఆగ్రహించిన న్యాయమూర్తి కోర్టు ప్రశాంత వాతావరణం దెబ్బతిందంటూ స్వర్ణ ఫోన్ స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఆ తరువాత కోర్టు ఆదేశాల ప్రకారం స్వర్ణ, రూ. 100 జరిమానా చెల్లించి జిల్లా న్యాయసేవాధికార సంస్థ నుంచి తన మొబైల్ ఫోన్‌ను వెనక్కు తెచ్చుకున్నారు.

Related posts

పంచ్ ప్రభాకర్ అరెస్టుకు రంగం సిద్ధం-సీబీఐ

Drukpadam

తృణమూల్ అఖండ విజయం : బీజేపీకి ఒక్కటీ దక్కలేదు…

Drukpadam

అప్పుల రాష్ట్రంగా తెలంగాణ…సీఎల్పీ నేత భట్టి ధ్వజం

Drukpadam

Leave a Comment