Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మిడతల గురించి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్పిన కేసీఆర్!

మిడతల గురించి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్పిన కేసీఆర్!

  • మిడతలు తెలంగాణలోకి రాకుండా నిలువరించామన్న కేసీఆర్
  • మిడతల సమస్యకు పరిష్కారం అడిగినట్లు చెప్పిన సీఎం
  • వైద్యారోగ్య వ్యవస్థ పకడ్బందీగా ఉంటే తక్కువ నష్టాలు ఉంటాయన్న ఎంటమాలజిస్టులు

నిమ్స్ దశాబ్ది బ్లాక్‌కు శంకుస్థాప‌న సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మిడ‌త‌ల దండుపై ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాన్ని చెప్పారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స‌బ్జెక్ అంటూ మిడ‌త‌ల దండుపై మాట్లాడారు. తనకు ఒక విచిత్రమైన అనుభవం ఉందని, మన ప్రాంతానికి సాధారణంగా మిడతల దండు రాదన్నారు. వెనుకటి కాలంలో ఉన్నప్పటికీ, ఈ మధ్యకాలంలో మన దగ్గర మిడత బెడద లేదన్నారు. మధ్య ఆసియా నుండి ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మీదుగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రానికి మిడతల దండు వస్తుంటుందని చెబుతూ… తాను చాలా ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్ చెబుతున్నానని తెలిపారు.

ఈ మిడతల దండు హర్యానాలోకి వచ్చి అక్కడి నుండి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోకి ప్రవేశించి, ఆదిలాబాద్ సరిహద్దు దాకా విస్తరిస్తూ వస్తోందన్నారు. భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తే ఆదిలాబాద్ ఉత్తర భాగాన ఉన్న కలెక్టర్లను, ఎస్పీలను అప్రమత్తం చేసి ప్రజలను, పంటలను కాపాడుకునేందుకు ఫైరింజన్లు, స్ప్రేలతో సన్నద్ధంగా ఉన్నామని, ఆ సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఒక మహిళా ఆఫీసర్, మన దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఇద్దరు ఎంటమాలజిస్టులు దీని పర్యవేక్షణ కోసం వచ్చారని తెలిపారు. వారికి హెలికాప్టర్ ఇచ్చి సరిహద్దులకు పంపించామని, మహారాష్ట్రలోనే మిడతల దండును చంపేయడం వల్ల, అవి మన దాకా రాలేదన్నారు. అనంతరం ఆ ఇద్దరు ఎంటమాలజిస్టులు తమను కలిసి తమకు హెలికాప్టర్ ఇచ్చి, మమ్మల్ని గౌరవించి బాగా చూసుకున్నారని ధన్యవాదాలు చెప్పారని వెల్లడించారు.

తన అకడమిక్ ఇంట్రెస్ట్ కొద్దీ సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో మిడతల సమస్యకు పరిష్కారం లేదా? అని వారిని అడిగానని కేసీఆర్ చెప్పారు. మిడతలను చంపలేం, నిర్మూలించలేం.. అది అసాధ్యమన్నారు. అవి నిద్రాణంగా ఉంటాయన్నారు. కరోనా కూడా అలాంటిదేనని చెప్పారని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్ని ఎలా రక్షించుకోవాలో సలహాలు ఇవ్వమని అడిగితే ఎక్కడైతే వైద్యారోగ్య వ్యవస్థ పకడ్బందీగా ఉంటుందో అక్కడ తక్కువ నష్టాలు జరుగుతాయని వారు చెప్పారన్నారు. దీని ద్వారా ఆరోగ్యశాఖ ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. అందుకే బడ్జెట్ లోనూ ఎక్కువ కేటాయింపులు జరుపుతున్నట్లు చెప్పారు.

Related posts

తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పై భగ్గుమంటున్న తల్లిదండ్రులు!

Drukpadam

మీరు పీఎం కిసాన్ ఈ-కేవైసీ చేయించారా…?లేకపోతె చేయించండి …

Drukpadam

చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి పిటిషన్… కొట్టివేసిన సుప్రీంకోర్టు…

Drukpadam

Leave a Comment