ఆంధ్రప్రదేశ్

దూసుకొచ్చిన బైక్ లు.. జంప్ చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్!

దూసుకొచ్చిన బైక్ లు.. జంప్ చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్!

  • ఈ ఉదయం మార్నింగ్ వాక్ కోసం రోడ్డు పైకి వచ్చిన నితీశ్ కుమార్
  • ఆయన వైపు దూసుకొచ్చిన రెండు బైక్ లు
  • భద్రతా వలయాన్ని ఛేదించుకుని వచ్చిన బైకర్లు

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భద్రతలో వైఫల్యం కలకలం రేపుతోంది. ఈ ఉదయం మార్నింగ్ వాక్ కోసం తన నివాసం నుంచి నితీశ్ బయటకు వచ్చారు. ఇంటి నుంచి సర్క్యులర్ రోడ్డుకు వెళ్లారు. సీఎం వాకింగ్ కు వచ్చిన నేపథ్యంలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. అయితే, ఇద్దరు వ్యక్తులు రెండు బైక్ లపై ఆ రోడ్డుపైకి వచ్చారు. భద్రతా వలయాన్ని దాటుకుని సీఎం వైపు దూసుకొచ్చారు.

దీంతో అప్రమత్తమైన నితీశ్ వెంటనే ఫుట్ పాత్ పైకి దూకారు. ఆ వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంబడించి బైకర్లను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన జరిగిన సర్క్యులర్ రోడ్డులో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సహా పలువురి నివాసాలు ఉన్నాయి. ఘటన జరిగిన తర్వాత ఎస్ఎస్జీ కమాండెంట్, పాట్నా ఎస్ఎస్పీని పిలిపించుకుని నితీశ్ మాట్లాడారు.

Related posts

శ్రీవారి నెయ్యి టెండర్లపై టీటీడీ క్లారిటీ.. ఆరోపణల్లో వాస్తవం లేదు!

Ram Narayana

టీఎస్ పి ఎస్ సి కేసుతో ఖమ్మానికి లింకులు….

Drukpadam

స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత… ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు !

Ram Narayana