Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీఎల్పీ నేత భట్టికి పొంగులేటి పరామర్శ…

సీఎల్పీ నేత భట్టికి పొంగులేటి పరామర్శ…
-ఆరోగ్య పరిస్థితిపై ఆరా …త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
-యాత్ర జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్న పొంగులేటి
-మళ్ళీ కలిసి చర్చింద్దామని వీరువురు నేతలు

గత కొన్ని రోజులుగా వరుసభేటీలతో హైద్రాబాద్ లో బిజీ ఉన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తిరిగి ఖమ్మం బాట పట్టారు . హైద్రాబాద్ నుంచి వస్తు పీపుల్స్ యాత్రలో అస్వస్థతకు గురై విశ్రాంతి తీసుకుంటున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ను సూర్యాపేట సమీపంలోని నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి లో ఆయన ఉంటున్న శిభిరం వద్ద కలిసి పరామర్శించారు . ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసు కున్నారు . త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు . అక్కడ నుంచి ఆయన ఖమ్మం వస్తు కూసుమంచి నియోజకవర్గంలో పార్టీష్టించారు .ఆయన వెంట మద్దినేని బేబీ స్వర్ణ కుమారి ఇతర నేతలు ఉన్నారు .

హైద్రాబాద్ లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వారితో చర్చలు జరిపిన మరుసటి రోజునే పొంగులేటి ఖమ్మం దారి పట్టారు . పనిలో పనిగా భట్టిని కలిశారు .రాజకీయాలు గురించి చర్చించారు . పార్టీలో అధికారికంగా చేరిన అనంతరం రాజకీయాలపై చర్చలు జరుపుదామని నేతలు అనుకున్నారు . భట్టి రెండు రోజుల విశ్రాంతి అనంతరం కూడా ఇంకా నిరాశగానే ఉన్నారు .

భట్టిని కలిసిన వారిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో పాటు ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద రెడ్డి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య లతో కలిసి పరామర్శించి ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనారోగ్య బారి నుంచి త్వరగా కోలుకొని పాదయాత్రను తిరిగి కొనసాగించాలని ఈ సందర్భంగా పొంగులేటి ఆకాంక్షించారు. అనంతరం కూసుమంచి మండలంలో పొంగులేటి పర్యటించారు.

Related posts

ఈ ఆహార పదార్థాలతో గుండె జబ్బులను దూరంపెట్టొచ్చు!

Drukpadam

ఆత్మ‌కూరులో రికార్డు స్థాయిలో న‌మోదైన పోలింగ్‌…

Drukpadam

ఖమ్మంలో మంత్రి అజయ్ చొరవ జర్నలిస్ట్ లకు వ్యాక్సినేషన్ కు ప్రత్యేక కౌంటర్

Drukpadam

Leave a Comment