Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

విజయవంతంగా కక్ష్యలోకి చంద్రయాన్-3… ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు..!

విజయవంతంగా కక్ష్యలోకి చంద్రయాన్-3… ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు..!

  • ఈ మధ్యాహ్నం నింగికెగసిన చంద్రయాన్-3
  • ప్రొపల్షన్ మాడ్యూల్ ను మోసుకెళ్లిన ఎల్వీమ్3-ఎం4 రాకెట్
  • చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన రాకెట్
  • 40 రోజుల పాటు ప్రయాణించి చంద్రుడ్ని చేరుకోనున్న మాడ్యూల్
శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ మధ్యాహ్నం నింగికెగిసిన చంద్రయాన్-3 మాడ్యూల్ నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. చంద్రయాన్-3ని గగనానికి మోసుకెళ్లిన ఎల్వీమ్3-ఎం4 రాకెట్ అన్ని దశలు సాఫీగా పూర్తి చేసింది. అనుకున్న సమయానికే చంద్రయాన్-3ని నిర్దేశిత కక్ష్యలోకి విడుదల చేసింది. 

ఎల్వీమ్3-ఎం4 రాకెట్ నుంచి చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ విజయవంతంగా విడిపోయింది. దాంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో సంబరాలు మిన్నంటాయి. 

తమ కృషి ఫలించినందుకు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఎల్వీఎమ్3-ఎం4 రాకెట్ చంద్రయాన్-3ని భూకక్ష్యలోకి చేర్చిందని వెల్లడించారు. ఇది క్రమంగా కక్ష్యను విస్తరించుకుంటూ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని వివరించారు. 

40 రోజుల ప్రయాణం అనంతరం ఈ చంద్రయాన్-3 లోని ల్యాండర్ జాబిల్లిపై దిగనుందని తెలిపారు. ప్రస్తుతం చంద్రయాన్-3 జాబిల్లి దిశగా వెళుతోందని చెప్పారు.

ఇస్రో శాస్త్రవేత్తల స్ఫూర్తికి, చాతుర్యానికి వందనం : ప్రధాని మోదీ

Narendra Modi hails ISRO scientists after Chandrayaan 3 success

చంద్రయాన్-3 ఎలాంటి ఆటంకాలు లేకుండా కక్ష్యలోకి ప్రవేశించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. 

భారత అంతరిక్ష పరిశోధన రంగం చరిత్రలో ఇది కొత్త అధ్యాయం అని అభివర్ణించారు. ప్రతి భారతీయుడి కలలు, ఆశయాలను ఉన్నతం చేసే ఘట్టం అని పేర్కొన్నారు. ఈ ఘనవిజయం మన శాస్త్రవేత్తల అంకితభావానికి నిదర్శనం అని ప్రధాని మోదీ కొనియాడారు. శాస్త్రవేత్తల స్ఫూర్తికి, చాతుర్యానికి వందనం చేస్తున్నానని తెలిపారు. 

చంద్రయాన్-3 ప్రయోగంపై కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కూడా హర్షం వ్యక్తం చేశారు. దేశానికి ఇది గర్వించదగిన రోజు అని పేర్కొన్నారు. చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వామ్యం అయ్యామని తెలిపారు. దేశ సాంకేతిక అభివృద్ధికి ఇది తార్కాణం అని వివరించారు. 

దేశం గర్వపడేలా చేసిన ఇస్త్రో శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇస్రో శక్తి సామర్థ్యాలు పెంచిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.

Related posts

జీవిత భాగస్వామి ఉండగా ‘సహజీవనం’ ముస్లిం సూత్రాలకు విరుద్ధం: అలహాబాద్ హైకోర్ట్ తీర్పు

Ram Narayana

గుజరాత్ లో భూకంపం… సూరత్ పరిసరాల్లో ప్రకంపనలు!

Drukpadam

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య.. ఆర్మీ వాహనంపై దాడి!

Ram Narayana

Leave a Comment