మున్నేరు బాధితుల రూ. కోటి అందజేసిన ఎంపీ బండి పార్థసారథి రెడ్డి
మున్నేరు ముంపు బాధితుల సహాయార్థం కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని రాజ్యసభ సభ్యులు డా. బండి పార్థసారథి రెడ్డి అందించినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఖమ్మం నగరం, నగరం చుట్టుపక్కల ముంపుకు గురై నష్టపోయిన వారి సహాయార్థం ఇట్టి మొత్తాన్ని అందించారన్నారు. కోటి రూపాయలు జిల్లా కలెక్టర్ అధికార ఖాతాకు ఎంపీ బదిలీ చేశారని తెలిపారు. రూ. కోటి సహాయానికి ముంపు బాధితులు, జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపారు. గత వరదల సందర్భంలో ముంపు బాధితుల సహాయానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రూ. కోటి ఆర్థిక సహాయాన్ని ఎంపీ అందజేశారని కలెక్టర్ గుర్తు చేశారు.