Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

వరద ప్రాంతాల్లో గవర్నర్ తమిళశై టూర్ …!

వరంగల్‌లో తీవ్ర స్థాయిలో వరదలు వచ్చాయి.. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి: గవర్నర్ తమిళిసై

  • వరంగల్ జిల్లాలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన గవర్నర్
  • స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్న తమిళిసై
  • ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్య

ఇటీవల భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలోని ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. వరంగల్‌లో వరదలు తీవ్ర స్థాయిలో వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు మొదలు పెట్టాలని సూచించారు. చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. బాధితులు తాగునీరు, నిత్యావసర వస్తువులు, మెడికల్ కిట్లు అందించాలని అన్నారు. 

రెండు జిల్లాల్లో పలు ప్రాంతాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఈ రోజు పర్యటించారు. జవహర్‌నగర్‌, నయూమ్ నగర్, భద్రకాళి బండ్, ఎన్టీఆర్ నగర్, ఎన్ఎన్ నగర్ లో ముంపు ప్రాంతాలను తమిళిసై పరిశీలించారు. ముంపు ప్రాంతాల కాలనీల్లోని బాధితులను పరామర్శించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బృందం వచ్చి నష్టాన్ని అంచనా వేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ముంపు ప్రాంతాల్లో బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయమని గవర్నర్ తమిళిసై కొనియాడారు.

Related posts

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: వచ్చే నెలలో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం

Ram Narayana

హైదరాబాద్‌లో ‘ఎర్త్ అవర్’.. గంటపాటు చీకట్లో ప్రజలు

Ram Narayana

నేను బీజేపీలో చేరానంటే చాలామందికి ఆశ్చర్యం వేయవచ్చు కానీ..: జయసుధ

Ram Narayana

Leave a Comment