Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

రైతు రుణమాఫీ పట్ల కేసీఆర్ కు అభినందనల వెల్లువ …అసెంబ్లీ లో సీఎం ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఖమ్మం ఎమ్మెల్యేలు…

రైతు రుణమాఫీ పట్ల కేసీఆర్ కు అభినందనల వెల్లువ …అసెంబ్లీ లో సీఎం ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఖమ్మం ఎమ్మెల్యేలు…
పుష్ప గుచ్చాలు అందించి హర్షం ప్రకటించిన ఎమ్మెల్యేలు
సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఛాంబర్ లో కలిసిన ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు…
రైతు రుణమాఫీ మరో ముందడుగు అని కితాబు…
బీఆర్ యస్ గెలుపును ఎవరు ఆపలేరని ధీమా …!

రైతుల రుణమాఫీకి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ పై పలువురు ఎమ్మెల్యేలు ప్రసంశలు కురిపిస్తున్నారు . అంతే ఆయన్ను స్వయంగా కలిసి అభినందనలు తెలుపుతున్నారు . మంచి సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నారని దీంతో ప్రతిపక్షాలకు మైండ్ దిమ్మతిరిగింది అభిప్రాయపడుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు . దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనీ ఊరు వాడ సంబరాలు జరపాలని మంత్రి కేటీఆర్ పిలుపుపై కూడా జిల్లాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు . ఇది ఒక మంచి ముందడుగు అని అభిప్రాయపడ్డారు …

గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హాజరైన ఖమ్మం జిల్లా శాసనసభ్యులు సీఎం కేసీఆర్ ని ఆయన ఛాంబర్ లో కలిసి,రైతు సంక్షేమం,ప్రజా సంక్షేమం దిశగా మరోసారి పలు ప్రగతి నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఇటీవల కేబినెట్లో తీసుకున్న పలు నిర్ణయాలతో పాటు,నిన్న తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయానికి కృతజ్ఞతాభినందనలు తెలిపారు.అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో ఖమ్మం జిల్లా శాసనసభ్యులు సీఎం కేసీఆర్ కు పుష్పగుచ్చాలు అందించి,తమ నియోజకవర్గ రైతుల తరఫున ప్రజల పక్షాన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ,వైరా శాసనసభ్యులు రాముల నాయక్ ,ఇల్లందు శాసనసభ్యురాలు బానోతు హరిప్రియ నాయక్ ,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ,అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Related posts

విశ్వనగరం హైద్రాబాద్ నివాస యోగ్యానికి పనికి రాదట …!

Drukpadam

పంటలకు యూరియా వినియోగం తగ్గించే విధంగా అవగాహన కార్యక్రమాలు: మంత్రి తుమ్మల

Ram Narayana

ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ram Narayana

Leave a Comment