Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

అమెరికా వీసా ఇంటర్వ్యూలో ఫెయిలైన వారికి ఓ గుడ్ న్యూస్!

  • మరోమారు ప్రత్యేకంగా స్లాట్లు జారీ చేసిన అమెరికా
  • ముంబై, చెన్నై, కోల్‌కత్తాల్లోని కాన్సులేట్లలో స్లాట్ల విడుదల
  • హైదరాబాద్‌లో స్లాట్లు జారీ కాక అభ్యర్ధుల్లో చర్చ
  • అమెరికాలో పైచదువులకు మరో అవకాశం లభించినందుకు విద్యార్థుల్లో హర్షం

పైచదువులకు అమెరికా వెళ్లాలనుకుంటున్న వారికి ఓ గుడ్ న్యూస్! గతంలో వీసా ఇంటర్వ్యూల్లో గట్టెక్కని వారికి అమెరికా మరో అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకూ వీసా స్లాట్లు లభించని వారికి కూడా స్లాట్లను వేర్వేరుగా విడుదల చేసింది. ఢిల్లీ రాయబార కార్యాలయంతో పాటు ముంబై, చెన్నై, కోల్‌కతాల్లోని కాన్సులేట్లలో ఈ స్లాట్లను విడుదల చేశారు. అయితే, హైదరాబాద్‌లో స్లాట్లు జారీ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకూ అమెరికా విద్యాసంస్థలు ఫాల్ సీజన్ తరగతులను ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో వీసా ఇంటర్వ్యూ కొత్త స్లాట్లను విడుదల చేసేందుకు అమెరికా నిర్ణయంచడంతో భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఫాల్ సీజన్‌లో భారతీయులకు లాభించేలా వీసాలు జారీ చేసేందుకు అమెరికా నిర్ణయించింది. 

అమెరికా వీసా ఇంటర్వ్యూలో వీసా లభించని వారు రెండు నెలలుగా వాటి కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో ఇలాంటి వారికి వెంటనే రెండోసారి వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశం ఉండేది. అయితే, ఒక విద్యాసంవత్సరంలో ఒకేసారి ఇంటర్వ్యూకు హాజరయ్యేలా అమెరికా ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసింది. కానీ ఈమారు రెండోసారి ఇంటర్వ్యూకు ప్రత్యేకంగా స్లాట్లు కేటాయించడంతో అనేక మందిలో మళ్లీ ఆశలు చిగురించాయి. 

మరోవైపు, పర్యాటక వీసాల కోసం భారతీయులకు నిరీక్షణ తప్పడం లేదు. తొలిసారి అమెరికా వెళ్లేందుకు వీసాల కోసం పలువురు కొన్ని నెలలుగా ఎదురు చేస్తున్నారు. ఇటీవల స్వల్ప సంఖ్యలో స్లాట్లు విడుదల చేసినా ఇంటర్వ్యూ తేదీలు 2024లో ఉండటంతో ఇబ్బందులు తప్పడంలేదు. అయితే, విద్యార్థి వీసా ప్రక్రియ పూర్తయిన తరువాత పర్యాటక వీసా స్లాట్లు విడుదల చేసే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Related posts

ఆ 700 మంది కరుడుగట్టిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న బంగ్లాదేశ్!

Ram Narayana

ముదురుతున్న వివాదం.. కెనడాపై భారత్ గుస్సా!

Ram Narayana

కెనడాలో కూలిన శిక్షణ విమానం, ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్ల మృతి

Ram Narayana

Leave a Comment