Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

జులై నుంచి దక్షిణ కొరియాలో మాస్కులతో పనిలేదట!

జులై నుంచి దక్షిణ కొరియాలో మాస్కులతో పనిలేదట!
  • ఒక్క డోసు తీసుకున్నా మాస్కు ధరించాల్సిన పనిలేదు
  • క్వారంటైన్ నిబంధనల్లోనూ సడలింపు
  • నేటి నుంచి 60-74 ఏళ్ల మధ్య వయసు వారికి వ్యాక్సినేషన్

దక్షిణ కొరియా ప్రభుత్వం తమ ప్రజలకు శుభవార్త చెప్పింది. కరోనా నిబంధనలను సడలించింది. కరోనా టీకా డోసు ఒక్కటి తీసుకున్నా సరే జులై నుంచి మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతేకాదు, క్వారంటైన్ నిబంధనలను సైతం సడలించేందుకు సిద్ధమైంది. అక్టోబరు నాటికి దేశంలోని 70 శాతం మందికి టీకా కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి క్వారంటైన్ నిబంధనలను సైతం సడలించనున్నట్టు తెలిపింది.

దేశంలో 60-74 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 60 శాతం మంది ఇప్పటికే వ్యాక్సిన్ల కోసం రిజిస్టర్ చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. నేటి నుంచి వీరికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాగా, 5.2 కోట్ల జనాభా కలిగిన దక్షిణ కొరియాలో ఇప్పటి వరకు 7.7 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. అక్కడ ఇప్పటి వరకు 1,37,682 మంది కరోనా మహమ్మారి బారినపడగా 1,940 మంది మరణించారు.

Related posts

ఒమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం తాజా మార్గదర్శకాలు!

Drukpadam

ఎంత శ్రమిస్తున్నా కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు: సీఎం జగన్

Drukpadam

వైరస్ ఏదైనా ఇక ఒకటే మందు.. కెనడా శాస్త్రవేత్తల కీలక ముందడుగు!

Drukpadam

Leave a Comment