Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జగన్ కు ఏమైంది …విజయవాడ ఆసుపత్రిలో నాలుగు గంటలు …

సీఎం జగన్‌కు వైద్య పరీక్షలు

  • కొన్ని రోజులుగా కాలి మడమ నొప్పితో బాధపడుతున్న సీఎం జగన్
  • సోమవారం విజయవాడలోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌లో పరీక్షలు
  • ఎమ్మారైతో పాటూ వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం. 
  • పరీక్షల సందర్భంగా జగన్ వెంటే ఆయన భార్య 
  • పరీక్షల అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన సీఎం

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏమైంది …సోమవారం ఆయన విజయవాడలోని ఒక ప్రవేట్ ఆసుపత్రిలో నాలుగు గంటలకు పైగా ఎందుకు ఉన్నారు . ఏమేమి పరీక్షలు చేయించుకున్నారు . చిన్న చికిత్స అయితే అన్ని గంటలు ఉండాల్సిన అవసరం ఏముంది .అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ..చాల సందర్భాలలో ఆయన కాలు నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం .. గతంలో జిమ్ చేస్తున్న సందర్భంగా కాలు బెణికింది వార్తలు వచ్చాయి . ఒక సందర్భంలో ఢిల్లీ వెళ్లలేక ముందుగా అనుకున్న కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు ..మళ్ళీ కాలు నొప్పి తిరగ బెట్టిందని అందువల్లనే ఆయన్ను భార్య భారతి బలవంతంగా ఆసుపత్రికి తీసుకోని వచ్చిందని సమాచారం …

కొన్ని రోజులుగా కాలి మడమ నొప్పితో బాధపడుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. విజయవాడలోని ఓ డయాగ్నస్టిక్ ల్యాబ్‌లో ఈ పరీక్షలు చేయించుకున్నారు. నిన్న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మొగల్రాజపురంలోని ఓ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు వెళ్లారు. 

ఎమ్మారై స్కాన్‌తో పాటూ ఆయన వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నట్టు తెలుస్తోంది. ల్యాబ్‌లో ఆయన సుమారు రెండు గంటలపాటు ఉన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా జగన్ వెంట ఆయన భార్య భారతి రెడ్డి కూడా ఉన్నారు. పరీక్షల అనంతరం జగన్ మూడు గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు.

Related posts

సమయపాలన పాటించాలన్న ప్రధానోపాధ్యాయురాలు.. భర్తతో కొట్టించిన టీచర్!

Drukpadam

అంగీకారం లేకుండా మహిళ పాదాలను తాకినా నేరమే: బాంబే హైకోర్టు!

Drukpadam

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు అస్వస్థత… ఎయిమ్స్ కు తరలింపు !

Drukpadam

Leave a Comment