తుమ్మల వద్దకు కేసీఆర్ రాయబారం …?
వచ్చినవారికి తలంటిన తుమ్మల …
మంత్రికి సైతం క్లాస్ తీసుకున్న తుమ్మల
ఇదేం మర్యాద ఇదేం పద్దతి అంటూ వారి ఆఫర్ ను తిరస్కరించిన తుమ్మల
మీకో నమస్కారం అంటూ వారిని పంపి వేసిన తుమ్మల
ఖమ్మం జిల్లాకు చెందిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పాలేరు టికెట్ ఇవ్వకపోవడం పై రగిలి పోతుండటంతో ఆయన్ను చల్లబర్చేందుకు కేసీఆర్ మంత్రి పదవి ఎర వేశారని విశ్వసనీయ సమాచారం… మంగళవారం ఖమ్మంజిల్లాకు చెందిన ఎంపీ , ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యేలు తుమ్మలవద్దకు సీఎం తరుపున రాయబారులుగా వెళ్లారు . కేసీఆర్ రేపు జరిగే విస్తరణలో మంత్రి పదవి ఇస్తామని చెప్పమన్నారని తెలిపారు . మీకు సముచిత గౌరవం , పార్టీలోస్తానం ,పదవులు ఇస్తామని చెప్పారని అన్నారు . హైద్రాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లిన దూతల మాటలు విన్న తుమ్మల ఆగ్రహంతో ఊగిపోయారు ..వెళ్లిన దూతలకు తలంటారు …. ఈపదవులు నేను చూడనవి ,చేయనివి కావు …మంచి మర్యాద , గౌరవం ఉండాలని వారికీ గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు సమాచారం .. దీనిపై వారు చేసేది లేక వెనుదిరిగారు .వారి వెళ్లిన కొద్దిసేపటికి ఒక కీలక మంత్రి తుమ్మలవద్దకు వెళ్లారు .ఆయనకు కూడా తుమ్మల అదే చెప్పడంతో వెళ్లిన మంత్రి ఇది సీఎం గారు చెప్పమన్న మాట అని ముక్తసరిగా చెప్పి వచ్చినట్లు తెలుస్తుంది… పాలేరు టికెట్ కోసం తుమ్మల మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు.గత ఎన్నికల్లో సొంతపార్టీ వాళ్ళవల్లనే ఓడిపోయినా విషయం సీఎం కేసీఆర్ కు తెలిసిన తిరిగి తనకు టికెట్ ఇవ్వకుండా అవమానపరచడంపై రగిలి పోతున్నారు …
ఇది ఎలా ఉండగా ఖమ్మం రూరల్ మండలంలోని ఒక ప్రవేట్ ఫంక్షన్ హల్ లో సమావేశమైన తుమ్మల అనుయాయులు పాలేరు లో బీఆర్ యస్ అభ్యర్థి కందాల ను ఓడిస్తామని శపథం చేశారు .తుమ్మల ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని ఆయన వెంటే తమ ప్రయాణమని తేల్చి చెప్పారు ..
తుమ్మలకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఖమ్మం జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్సీ తాతా మధు , ఎమ్మెల్యే వెంకటవీరయ్య ,హైద్రాబాద్ లోని తుమ్మల నివాసానినికి వెళ్లి పరామర్శించించారు .