Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వాహనదారులకు శుభవార్త.. పసుపు గీత దాటితే టోల్ చెల్లించాల్సిన పనిలేదన్న ప్రభుత్వం!

వాహనదారులకు శుభవార్త.. పసుపు గీత దాటితే టోల్ చెల్లించాల్సిన పనిలేదన్న ప్రభుత్వం!
ప్రతి టోల్‌బూత్ వద్ద 100 మీటర్ల దూరంలో పసుపు గీతలు
వాహనాల క్యూ ఆ గీత దాటితే టోల్ ఫ్రీ
నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకేనన్న ఎన్‌హెచ్ఏఐ
వాహనదారులకు ఇది శుభవార్తే. టోల్‌బూత్‌ల వద్ద వాహనదారుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ప్రతి టోల్ బూత్ వద్ద 100 మీటర్ల దూరంలో పసుపు గీతలు గీయాలని నిర్ణయించింది. టోల్ చెల్లించే సమయంలో వాహనాల బారు ఆ గీతను దాటితే ఇక టోల్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అప్పటి వరకు క్యూలో ఉన్న వాహనాలన్నింటినీ రుసుము వసూలు చేయకుండానే వదిలేయాల్సి ఉంటుంది. ఇది వినేందుకు బాగానే ఉన్న ఆచరణ సాధ్యం కానిది అంటున్నారు వాహనదారులు . గీత దాటకముందే వాహనాలకు పీజులు వసూల్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. అవసరమైతే డిజిటల్ యంత్రాలని మనుశులకిచ్చి వాహనాలను స్కానింగ్ చేస్తారు .

ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది. వాహనదారుల కష్టాలు తీర్చే ఉద్దేశంతోనే ఎన్‌హెచ్ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిన్న మార్గదర్శకాలు విడుదల చేసింది. టోల్‌ప్లాజాల వద్ద నిరీక్షణ సమయాన్ని కుదించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో టోల్ ప్లాజాల వద్ద ఒక్కో వాహనానికి రుసుము చెల్లించేందుకు పట్టే కాలం పది సెకన్లకు తగ్గిపోనుందని ఎన్‌హెచ్ఏఐ తెలిపింది.

Related posts

పర్యాటకుల ప్రాధాన్యం ‘గోవా’.. తర్వాత మనాలి!

Drukpadam

విశాఖలో పర్యటనలో సీఎం జగన్… ఆసక్తికరమైన ఫొటోలు !

Drukpadam

బ్రిటన్ రాజు పట్టాభిషేకానికి రూ.1,020 కోట్లు ఖర్చు

Drukpadam

Leave a Comment