Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్కోర్ట్ తీర్పులు

వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతకు అరెస్ట్ వారెంట్ జారీ

  • వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, పార్థసారథి, టీడీపీ నేత వంగవీటి రాధాలకు నోటీసులు
  • 2015 నాటి కేసులో వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం
  • ప్రత్యేక హోదా కోరుతూ నిరసన వ్యక్తం చేసిన కేసులో కోర్టుకు హాజరుకాని నేతలు

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నేత వంగవీటి రాధాలకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యాయి. ఎనిమిదేళ్ల క్రితం కేసుకు సంబంధించి వీరికి కోర్టు వీరికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2015లో ప్రత్యేక హోదాను కోరుతూ విజయవాడ బస్టాండ్ వద్ద వైసీపీ నేతలు ధర్నా చేశారు. ఈ నిరసనపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేయగా, ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఎమ్మెల్యేలు కొడాలి నాని, పార్థసారథి, వంగవీటి రాధా విచారణకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది.

Related posts

మనది త్యాగాల గుణం పోరాటాల వారసత్వం ఉన్న సంఘం…విరాహతలి

Drukpadam

ఈటలకు డీఎస్ హితోపదేశం

Drukpadam

డిసెంబరు 23 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు

Ram Narayana

Leave a Comment