Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన రేణుకా చౌదరి… వీడియో ఇదిగో!

  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేయడమేంటన్న రేణుకా చౌదరి
  • జగన్ ఒక మూర్ఖుడని కామెంట్ 
  • త్వరలోనే మదం తగ్గుతుందని వ్యాఖ్యలు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఘాటుగా స్పందించారు. ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ఒక మూర్ఖుడిగా, మానసిక రోగిగా అభివర్ణించారు. 

అసలు జగన్ మోహన్ రెడ్డి ‘స్కిల్ డెవలప్ మెంట్’ కు ఎవరూ సరితూగరని ఎద్దేవా చేశారు. మోసాలు చేయడానికి, బాబాయ్ ని చంపుకోవడంలోనూ, తండ్రి శవం వద్ద సంతకాల కోసం ప్రయత్నించడంలోనూ ఆయన ‘స్కిల్’ అందరికీ తెలిసిందేనని వ్యంగ్యం ప్రదర్శించారు. అధికార దాహంతో జగన్ రొప్పుతున్నాడని, అతి త్వరలో అతడి మదం తగ్గుతుందని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. 

“ఆ సీఐడీ పోలీస్ సంస్థ ఏంటండీ బాబూ… ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, ఎలాంటి లోపాలు లేకుండా అరెస్ట్ చేస్తారా? జగన్ ఒక మెంటల్ కేసు. రాజ్యాంగంలో ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఐదేళ్లకు ఇలాంటి నాయకులకు మానసిక వైద్య పరీక్షలు చేసి, మానసికంగా సరిగ్గా ఉన్నారా లేదా అనేది నిర్ధారించాలి. ఇంతవరకు ఒక్క రాజధానే రాలేదు కానీ, మూడు రాజధానులు అని మాట్లాడిన మూర్ఖుడు జగన్. ఒక మాజీ ముఖ్యమంత్రితో వ్యవహరించే తీరు ఇలాగేనా?” అంటూ రేణుకా చౌదరి మండిపడ్డారు.

Related posts

ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో!: పవన్ కల్యాణ్ కు ప్రకాశ్ రాజ్ చురక

Ram Narayana

అయ్యప్ప భక్తుల కోసం ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్!

Ram Narayana

వరద భాదితుల కోసం హెటిరో డ్రగ్స్ అధినేత ఎంపీ బండి పార్ధసారధి రెడ్డి భూరీ విరాళం!

Ram Narayana

Leave a Comment