Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణను వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

  • రెండు పిటిషన్లపై వాదనలను రేపటికి వాయిదా వేసిన కోర్టు
  • కస్టడీ పిటిషన్ పై సీఐడీ మోమో దాఖలు చేసిన తర్వాత విచారణ జరుపుతామని వెల్లడి
  • రెండు పిటిషన్లపై ఒకేసారి ఆదేశాలను వెలువరిస్తామన్న న్యాయస్థానం

టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్లపై విచారణను విజయవాడలోని ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్ లపై రేపు విచారిస్తామని తెలిపింది. కస్టడీ పిటిషన్ పై సీఐడీ మెమో దాఖలు చేసిన తర్వాత విచారణ జరుపుతామని చెప్పింది. రేపు కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న తర్వాత… రెండింటిపై ఒకేసారి ఆదేశాలను వెలువరిస్తామని తెలిపింది. ఈ రెండు పిటిషన్లపై దేన్ని ముందు విచారించాలో రేపు నిర్ణయిస్తామని వెల్లడించింది. మరోవైపు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను రేపు ప్రస్తావించడానికి సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.

చంద్రబాబును 33 ప్రశ్నలు అడిగి ఆధారం చూపించలేకపోయారు: ములాఖత్ తర్వాత అచ్చెన్నాయుడు

  • చంద్రబాబుపై ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారన్న అచ్చెన్నాయుడు
  • సంబంధం లేని ప్రశ్నలు అడిగారని విమర్శ
  • చంద్రబాబుకు మద్దతుగా వస్తున్న వారిని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని వ్యాఖ్య
  • జైల్లో చంద్రబాబు ధైర్యంగా ఉన్నారన్న అచ్చెన్నాయుడు
Atchannaidu says chandrababu faces 33 questions from cid

చంద్రబాబును రెండురోజుల పాటు విచారించిన సీఐడీ అధికారులు 33 ప్రశ్నలు వేసి, కనీసం ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో భాగంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు కలిశారు. ములాఖత్ అనంతరం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబుపై ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారన్నారు. పనికిమాలిన, సంబంధం లేని ప్రశ్నలు వేశారని, రెండురోజుల పాటు ఆయనను ఇబ్బంది పెట్టారన్నారు.

చంద్రబాబును విచారించిన సీఐడీకి ఒక్క ప్రశ్నలోను అనుమానం కనిపించలేదన్నారు. తమ పార్టీ అధినేతను జైల్లోనే ఉంచేందుకు కేసు మీద కేసు వేస్తున్నారని ఆరోపించారు. జైల్లో ఆయన ధైర్యంగా ఉన్నారని, ధైర్యంగా పోరాడాలని తమకు సూచన చేశారన్నారు. జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేసి ముందుకు సాగాలని చెప్పారన్నారు. చంద్రబాబు అవినీతి అని చెప్పడమే తప్ప ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారన్నారు. డబ్బులు వచ్చాయని, అక్రమాలు చేశారని చెప్పేందుకు ఆధారాలు లేవన్నారు. ప్రాథమిక ఆధారాలు లేవని, అరెస్టైన తర్వాత ఇప్పుడు ఆధారాలు సేకరిస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు అకౌంట్లలోకి డబ్బులు వెళ్లినట్లు ఎక్కడైనా ఆధారాలు చూపించిందా? అన్నారు.

చంద్రబాబుకు మద్దతుగా బయటకు వచ్చిన వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తున్నారన్నారు. 70 దేశాల్లోని ఉద్యోగులు తమ పార్టీ అధినేత అరెస్టును ఖండించారన్నారు. జైల్లో చంద్రబాబు ధైర్యంగా ఉన్నారని, పోరాటపటిమతో ఉన్నారన్నారు. ఆయన సలహాలు, సూచనలతో పార్టీని ముందుకు తీసుకు వెళ్తామన్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, కానీ భద్రతపై అనుమానాలు ఉన్నాయన్నారు. పరిశుద్ధత బాగా లేదని, దోమలు విపరీతంగా ఉన్నాయన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ సీబీఐ విచారణ కోరడంపై స్పందిస్తూ… ఆధారాలు లేనప్పుడు ఏ విచారణ అయినా ఇబ్బంది లేదన్నారు.

Related posts

వైఎస్ జగన్ ఆస్తుల కేసు: సీబీఐ కోర్టులో మరోసారి విచారణ వాయిదా…

Ram Narayana

ఏపీ విభజన బిల్లుపై సుప్రీంకోర్టులో విచారణ… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం…

Ram Narayana

అశ్లీల చిత్రాలను వ్యక్తిగతంగా చూడడం తప్పేమీ కాదు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Ram Narayana

Leave a Comment