Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మంకు తుమ్మల…. పాలేరుకు పొంగులేటి….?

కాంగ్రెస్ నుంచి ఖమ్మంకు తుమ్మల…. పాలేరుకు పొంగులేటి….?
ఈరోజు ,రేపట్లో ఫైనల్ అయ్యే అవకాశం
అభ్యర్థుల వడపోతకోసం ఢిల్లీకి చేరిన నేతలు
కొత్తగూడెం పై పోట్ల గట్టిగా పట్టుబడుతున్నా, బీసీ కోటాలో ఎడవల్లి…
భట్టి ,పొడెంలు మధిర , భద్రాచలం కు ఖరారు
వైరా , సత్తుపల్లి ,అశ్వారావుపేట , పినపాక , ఇల్లందు లపై కొనసాగుతున్న స్క్రినింగ్

ఉమ్మడి ఖమ్మంజిల్లాపై పెద్ద ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో తలమునకలైంది . జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థులపై ఒక క్లారిటీ వచ్చింది..ఖమ్మం బరిలో మాజీమంత్రి తుమ్మల దాదాపు రంగంలోకి దిగబోతున్నారు . ఇక పాలేరు విషయానికి వస్తే పార్టీ ప్రచార కమిటీ కో- చైర్మన్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ ఖాయమంటున్నారు . అనేక తర్జనభర్జన మధ్య ఇటీవల పార్టీలో చేరిన ఈ నేతలపై పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ..ఇక మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ,భద్రాచలం నుంచి పొందే వీరయ్య లు రంగంలో ఉంటారు ..కొత్తగూడెం పై ఊగిసలాట కొనసాగుతుంది..పోట్ల నాగేశ్వరరావు సీటు నాకే కావాలని అంటున్నారు .అదే సందర్భంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు సీట్లలో ఒక సీటు తప్పకుండ బీసీలకు ఇవ్వాలనే అభిప్రాయంతో ఏఐసీసీ ఉంది.దీంతో కొత్తగూడెం సీటు బీసీలకు కేటాయించే అవకాశం ఉంది.. బీసీలకు ఇస్తే ఎడవల్లి కృష్ణ మొదటి ఛాయస్ గా ఉంటారు ..వైరా , సత్తుపల్లి ,అశ్వారావుపేట , పినపాక , ఇల్లందు లపై కొనసాగుతున్న స్క్రినింగ్ పై ఇక్కడ ఆశావహులు ఆతృతగాఎదురు చూస్తున్నారు ..ఈనియోజకవర్గాల నుంచి రాష్ట్ర స్క్రినింగ్ కమిటీ మూడు పేర్ల చొప్పున సిఫార్స్ చేసింది..వాటిని వడపోసే కార్యక్రమం ఢిల్లీల జరుగుతుంది…రేపటికల్లా అభ్యర్థుల విషయంలో 99 శాతం ఒక అంచనాకు వస్తారు …అభ్యర్థుల ప్రకటన మాత్రం ఈనెల 30 లోపు ప్రకటించే అవకాశం ఉంది..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 కి నియోజకవర్గాల్లో గెలిచితీరాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ కు టికెట్స్ ఆశిస్తున్నా వారిసంఖ్య ఎక్కువగా ఉండటంతో కొంత తలనొప్పిగా మారింది . సర్వేల ఆధారంగా టికెట్స్ పంపిణి అంటున్న ఫైరవీలు మాత్రం ఆగడంలేదు . టికెట్స్ ఆశించి రానివారిని సముదాయించే పనిలో పార్టీ పెద్దలు నిమగ్నమైయ్యారు .ఖమ్మం జిల్లాలో ఇప్పటికే నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉన్న నేతలు ఎవరు బయటనుంచి నేతలు వచ్చి తమ సీట్లకు ఎసరు పెడుతున్నారని అసంతృప్తి ఉన్నారు …దీనిపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చిన త్రిమూర్తులు రానివారిని ఎలా బుజ్జగిస్తారో చూడాలి మరి ..!

Related posts

పూర్తిగా మద్దతిస్తున్నాను…: మోదీ బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కల్యాణ్

Ram Narayana

రాహుల్ గాంధీ కొల్లాపూర్‌కు ఎందుకు వచ్చాడు?: కేసీఆర్ ప్రశ్న

Ram Narayana

తెలంగాణలో మూడ్రోజుల పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక పర్యటన

Ram Narayana

Leave a Comment