కోర్ట్ తీర్పులు

స్కిల్ కేసులో నారా లోకేశ్ కు అక్టోబర్ 4 వరకు బెయిల్ మంజూరు.. ఫైబర్ గ్రిడ్ కేసు విచారణ వాయిదా!

  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేశ్ కు స్వల్ప ఊరట
  • అప్పటి వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు
  • తదుపరి విచారణ 5వ తేదీకి వాయిదా

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అక్టోబర్ 4వ తేదీ వరకు బెయిల్ ఇచ్చింది. అప్పటి వరకు లోకేశ్ ను అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేశ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో విచారణను అక్టోబర్ 4 వరకు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. మరోవైపు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ కు 41ఏ నోటీసులు ఇవ్వాలని సీఐడీని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Related posts

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష…

Ram Narayana

బాలికపై లైంగిక దాడి కేసులో కోర్టు సంచలన తీర్పు.. యూపీ బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలుశిక్ష

Ram Narayana

‘పతంజలి’పై కోర్టు మరోమారు ఆగ్రహం.. క్షమాపణ ప్రకటన సైజుపై ఆరా…

Ram Narayana