- మరో రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
- సన్నద్ధమవుతున్న బహుజన్ సమాజ్ పార్టీ
- సిర్పూర్ నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో నేడు 20 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నారు. ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. పలు కసరత్తుల అనంతరం మిగతా స్థానాలకు కూడా విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. తెలంగాణలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం తెలిసిందే.
బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా…
1. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్- సిర్పూర్
2. మేడి ప్రియదర్శిని- నకిరేకల్
3. పిలుట్ల శ్రీనివాస్- కోదాడ
4. జంగం గోపి- జహీరాబాద్
5. బానోత్ రాంబాబు నాయక్- వైరా
6. ఎన్.రాంచందర్- మానకొండూరు
7. దాసరి ఉషా- పెద్దపల్లి
8. నాగమోని చెన్న రాములు ముదిరాజ్- వనపర్తి
9. ప్రద్న్యకుమార్ మహదేవ్ రావు ఏకాంబర్- జుక్కల్
10. ముప్పారపు ప్రకాశం- ఆందోల్
11. చంద్రశేఖర్ ముదిరాజ్- తాండూర్
12. ఎర్రా కామేశ్- కొత్తగూడెం
13. నక్కా విజయ్ కుమార్- ధర్మపురి
14. కొత్తపల్లి కుమార్- నాగర్ కర్నూలు
15. వట్టె జానయ్య యాదవ్- సూర్యాపేట
16. డాక్టర్ ముదావత్ వెంకటేశ్ చౌహాన్- దేవరకొండ
17. గడ్డం క్రాంతి కుమార్- వికారాబాద్
18. బన్సీలాల్ రాథోడ్- ఖానాపూర్
19. కొంకటి శేఖర్- చొప్పదండి
20. అల్లిక వెంకటేశ్వరరావు యాదవ్- పాలేరు