Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్ అవినీతి, కుటుంబపాలనకు చివరి రోజులు …బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా !

  • ఘట్ కేసర్ లో బీజేపీ రాష్ట్ర మండలి సమావేశం
  • హాజరైన జేపీ నడ్డా
  • కాంగ్రెస్ వల్లే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయన్న నడ్డా
  • నాడు టీఆర్ఎస్ కూడా ఆ విధంగా పుట్టిందేనని వెల్లడి
  • వచ్చే ఎన్నికలతో బీఆర్ఎస్ కుటుంబ పాలన ముగిసిపోతుందని వ్యాఖ్యలు

కేసీఆర్ అవినీతి , కుటుంబపాలన అంతంగాక తప్పదని ఇవేవారికి చివరి ఎన్నికలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా బీఆర్ యస్ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు …కేసీఆర్ తెలంగాణాలో నిజం పాలనా సాగిస్తున్నారని ధ్వజమెత్తారు . ప్రజల సమస్యలు గాలికి వదిలి సంపాదనే ద్యేయంగా పనిచేస్తుందని విమర్శలు గుప్పించారు .

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ గతంలో ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించిన ఫలితంగా దేశంలో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. నాడు టీఆర్ఎస్ పార్టీ కూడా ఆ విధంగా ఏర్పడినదేనని వివరించారు. 

ప్రాంతీయ పార్టీలు కేవలం తమ ప్రాంతీయ ఆకాంక్షల కోసమే ఏర్పడడంతో సుదీర్ఘ కాలం పాటు జాతీయ ఆకాంక్షలు విస్మరణకు గురయ్యాయని నడ్డా తెలిపారు. ఆయా ప్రాంతీయ పార్టీలు క్రమంగా కుటుంబ పార్టీలుగా అవతరించాయని, ఇప్పటి బీఆర్ఎస్ కూడా ఒక కుటుంబ పార్టీయేనని స్పష్టం చేశారు. 

తెలంగాణలో కేసీఆర్ పాలన  రజాకార్లను తలపిస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికలతో తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబ పాలన ముగిసిపోతుంది… కేసీఆర్ కు నేనిచ్చే సందేశం ఇదే అని నడ్డా ఉద్ఘాటించారు. మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ లో ఇవాళ బీజేపీ రాష్ట్ర మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా నడ్డా పైవ్యాఖ్యలు చేశారు.

Related posts

కేసీఆర్ మాట నిటబెట్టుకోలేదు: కేశవరావు

Ram Narayana

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కసరత్తు …మరో ఆరుగురు మంత్రులు !

Ram Narayana

కాంగ్రెస్ వచ్చేది లేదు …చచ్చేదిలేదు ..భట్టి ముఖ్యమంత్రా …? మధిర సభలో కేసీఆర్ ఎద్దేవా.!

Ram Narayana

Leave a Comment