తెలంగాణ వార్తలు

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు..

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు..

*ఒంటిపూట బడులు మార్చి 16 నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గం టల వరకే బడులు నడుపుతారు. 12:30 గంటల సమయంలో మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న సెంటర్లలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడుపుతారు. పరీక్షలున్నంత కాలం పదో తరగతి స్పెషల్ క్లాసులు నడుస్తాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తారు. జూన్ 12 నుంచి 2026 -27 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. రంజాన్ నేపథ్యంలో ఉర్దూ మీడియం బడులు, డైట్ కాలే జీలకు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఒంటిపూట నిర్వహించే వెసులుబాటు ఇచ్చింది. ఉదయం 8 నంచి మధ్యాహ్నం 1:30గంటల వరకు వీటిని నడపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నారు. మార్చి 20 తర్వాత బడులు, డైట్ కాలేజీలను అదనంగా నడుపాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.

Related posts

ఎట్టకేలకు మేడిగడ్డ పనులు ప్రారంభం…

Ram Narayana

రాజేంద్రనగర్‌లో తెలంగాణ కొత్త హైకోర్టు… శంకుస్థాపన చేసిన సీజేఐ…

Ram Narayana

హైదరాబాద్ లో నకిలీ మందుల దందా

Ram Narayana