Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

కెనడాలో పడరాని పాట్లు పడుతున్న భారత విద్యార్థులు..

వైద్య డిగ్రీలు అందుకుని రెస్టారెంట్లలో బిల్లులు కొడుతూ నెట్టుకొస్తున్న వైనం!

  • భారత్-కెనడా మధ్య దెబ్బతిన్న దౌత్య సంబంధాలు
  • చదువులు పూర్తయినా ఉద్యోగాలు దొరక్క భారత విద్యార్థుల ఇక్కట్లు
  • గతేడాది కెనడాకు 2,26,450 మంది విద్యార్థులు

భారత్-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత అక్కడి భారత విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్కసారిగా చుట్టుముట్టిన కష్టాల నుంచి బయటపడలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగావకాశాలు లేక ఇక్కట్లు పడుతున్నారు. 2022లో మొత్తం 2,26,450 మంది భారత విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేందుకు కెనడా వెళ్లినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గ్లోబల్ ఎడ్యుకేషన్ సెర్చ్ ప్లాట్‌ఫాం ‘ఎరుడెరా’ ప్రకారం.. ఉన్నత విద్య సహా అన్ని స్థాయుల్లోనూ మొత్తం 8,07,750 మంది అంతర్జాతీయ విద్యార్థులు కెనడాలో ఉన్నారు. వీరిలో 5,51,405 మంది గతేడాది స్టడీ పర్మిట్ పొందారు. మిగతా దేశాల విద్యార్థులతో పోలిస్తే గతేడాది అత్యధికంగా 2,26,450 మంది భారతీయ విద్యార్థులు స్టడీ పర్మిట్లు అందుకున్నారు. 

భారత్-కెనడా మధ్య విభేదాల గురించి తాను అంతగా ఆలోచించడం లేదని, తన ఆందోళనంతా భవిష్యత్తు కోసమేనని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉద్యోగాల కొరత చాలా ఉందని, చదువు పూర్తయ్యాక ఉద్యోగం పొందగలనో, లేదోనని మరో విద్యార్థి చెప్పుకొచ్చాడు. గ్రేటర్ టొరంటో పరిధిలోని చాలామంది విద్యార్థులు ఇలాంటి ఆందోళనే వ్యక్తం చేస్తున్నారు. 

ఢిల్లీ-ఒట్టావా మధ్య దౌత్యపరమైన ప్రతిష్ఠంభన తర్వాత చదువు పూర్తయినా పని దొరకలేదనే ఆలోచన తనకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతోందని ఇంకో విద్యార్థి చెప్పుకొచ్చాడు. ఇక్కడ వైద్య డిగ్రీలు అందుకున్న ఎంతోమంది భారతీయ విద్యార్థులు తనకు తెలుసని, వారందరూ మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు పొందలేకపోయారని, దీంతో వారు క్యాబ్‌లు, దుకాణాలు నడుపుకుంటున్నారని, మరికొందరు రెస్టారెంట్లలో పనిచేస్తున్నారని తెలిపాడు. ఇది చాలా సవాలుతో కూడిన పరిస్థితి అని మరికొందరు విచారం వ్యక్తం చేశారు.

Related posts

భూ భ్రమణం మారుతోంది.. కొత్త అధ్యయనంలో సంచలనాలు…

Ram Narayana

అమెరికా రోడ్డు ప్ర‌మాదంలో తెలుగు విద్యార్థి మృతి!

Ram Narayana

హిజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం… ఇజ్రాయెల్ ప్రకటన!

Ram Narayana

Leave a Comment