Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అసెంబ్లీ ఎన్నికలుజాతీయ వార్తలు

ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా…తెలంగాణలో నవంబర్ 30 ఎన్నికలు ..

ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా…తెలంగాణలో నవంబర్ 30 ఎన్నికలు ..
ఐదు రాష్ట్రాల కౌంటింగ్ డిసెంబర్ 3 వ తేదీ న …
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3 న ,
నామినేషన్స్ స్వీకరణ చివరి తేదీ నవంబర్ 10 వ తేదీ ..
13 తేదీ నామినేషన్స్ పరిశీలిన ,15 తేదీ వరకు ఉపసంహరణ
మిజోరాంలో నవంబర్ 7 ఎన్నికలు …మధ్యప్రదేశ్ లో నవంబర్ 17 ఎన్నికలు
ఛత్తీస్ ఘడ్ లో నవంబర్ 7 ,17 రెండు విడతలు , రాజస్థాన్ లో నవంబర్ 23 ఎన్నికలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 3 న …డిసెంబర్ 5 ఎన్నికల ప్రక్రియ పూర్తీ ..

ఎప్పుడా….ఎప్పుడా అని ఎదురుచూస్తున్నా ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది….ఈ విషయాన్నీ ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ న్యూ ఢిల్లీలోని ఎన్నికకు కమిషన్ కార్యాలంయంలో షడ్యూల్ ప్రకటించారు .
మిజోరాం లో నవంబర్ 7 న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు ..
ఛత్తీస్ ఘడ్ ఎన్నికలు నవంబర్ 7 ,17 రెండు విడతలు
మధ్యప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 17 ఒకేరోజు
రాజస్థాన్ ఎన్నికలు నవంబర్ 23 ఒకే రోజు
అదే విధంగా నవంబర్ 30 న తెలంగాణ ఎన్నికలు ఒకేరోజు
ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 3 తేదీన జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది…డిసెంబర్ 5 మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తీ అవుతుందని ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు .

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 3 వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు ..ఆరోజు నుంచి నవంబర్ 10 వ తేదీవరకు నామినేషన్లు స్వీకరిస్తారు …పరిశీలన నవంబర్ 13 న జరగనుండగా , నవంబర్ 15 వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ …పోలింగ్ నవంబర్ 30 జరగనుండగా , మిగతా రాష్ట్రాలతోపాటు డిసెంబర్ 3 వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది..డిసెంబర్ 5 తో ఎన్నికల ప్రక్రియ పూర్తీ అవుతుంది….

తెలంగాణాలో 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా , రాజస్థాన్ లో 200 స్థానాలకు , మధ్యప్రదేశ్ లో 230 స్థానాలకు , ఛత్తీస్ ఘడ్ లో 90 స్థానాలకు ,మిజోరాం లో 40 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకుఎన్నికలు జరగనుండగా ,16 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు . ప్రశాంతంగా ఎన్నికల నిర్వాణకు తగిన ఏర్పాట్లు చేసినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు .

Related posts

రాజస్థాన్ లో కొత్త పార్టీ లేనట్లే.. ఎలాంటి ప్రకటన చేయని సచిన్ పైలట్

Drukpadam

హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. అదానీకి మరో భారీ షాక్!

Drukpadam

ముంబైలో 14 మందిని బలిగొన్న 230 అడుగుల అక్రమ హోర్డింగ్!

Ram Narayana

Leave a Comment