Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

సతీసమేతంగా ప్రగతి భవన్ కు పొన్నాల… సాదరంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్

  • కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల
  • నిన్న పొన్నాల నివాసానికి వెళ్లిన కేటీఆర్
  • బీఆర్ఎస్ లోకి రావాలంటూ ఆహ్వానం
  • ముందు కేసీఆర్ తో మాట్లాడాల్సి ఉందన్న పొన్నాల
  • నేడు కేసీఆర్ తో పొన్నాల సమావేశం 
CM KCR welcomes Ponnala couple

సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్న పొన్నాల ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి రావాలంటూ ఆయనను ఆహ్వానించారు. అయితే, తాను ముందుగా  సీఎం కేసీఆర్ తో మాట్లాడాల్సి ఉందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటానని పొన్నాల చెప్పారు. చెప్పినట్టుగానే ఇవాళ ఆయన సీఎం కేసీఆర్ ను కలిశారు. 

తన అర్ధాంగితో కలిసి పొన్నాల నేడు ప్రగతి భవన్ కు విచ్చేశారు. పొన్నాల దంపతులను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. వారితో సమావేశమై యోగక్షేమాలు తెలుసుకున్నారు. పొన్నాలతో కాసేపు ముచ్చటించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కె.కేశవరావు, దాసోజు శ్రవణ్ కూడా పాల్గొన్నారు. 

నిన్న కేటీఆర్ ప్రతిపాదనకు పొన్నాల సానుకూలంగానే స్పందించారన్న నేపథ్యంలో, రేపటి జనగామ సభలో ఆయన గులాబీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయి.

Related posts

కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పనిచేసుకోవాలి: మంత్రి సీతక్క

Ram Narayana

జనసేనతో కలిసి పని చేయండి: కిషన్ రెడ్డికి అమిత్ షా సూచన

Ram Narayana

ఓటు కిస్మత్‌ను మారుస్తుంది.. తేడా వస్తే జీవితాలు కిందామీద అవుతాయి: కేసీఆర్

Ram Narayana

Leave a Comment