Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణలో కాంగ్రెస్ , లెఫ్ట్ పొత్తు…!

కాంగ్రెస్ తో కామ్రేడ్ పొత్తు ఫైనల్ ….సిపిఎం , సిపిఐ కి చెరో రెండు సీట్లు ….
చెరో ఐదు సీట్లు కోరిన సిపిఎం , సిపిఐ లు
సిపిఐ కి కొత్తగూడెం , చెన్నూరు …సిపిఎం కు మిర్యాలగూడం, వైరా …
పాలేరు , భద్రాచలం , మిర్యాలగూడెం , ఇబ్రహీంపట్నం,మధిర కోరిన సిపిఎం
కొత్తగూడెం , వైరా, మునుగోడు , బెల్లంపల్లి, హుస్నాబాద్ సీట్లు కోరిన సిపిఐ

కాంగ్రెస్ తో కామ్రేడ్ పొత్తు ఫైనల్ అయింది … సిపిఐకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం , ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు , సిపిఎంకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా , ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాలయగూడెం సీట్లు కేటాయించారు … చాలాకాలంగా చర్చోపచర్చలు జరుగుతుండటంతో కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు విషయం కొలిక్కి వస్తుందా రాదా..?అనే సందేహాలు మధ్య పొత్తు ఖరారు కావడంతో అటు కాంగ్రెస్ ఇటు లెఫ్ట్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు . లెఫ్ట్ పార్టీలు చెరో ఐదు సీట్లు కావాలని కోరాయి. 10 సీట్ల జాబితాను కాంగ్రెస్ అందజేశాయి… వాటిలో సిపిఎం పాలేరు , మధిర, భద్రాచలం , మిర్యాలగూడెం , ఇబ్రహీంపట్నం కోరగా , సిపిఐ కొత్తగూడెం ,మునుగుడు , హుస్నాబాద్ , బెల్లంపల్లి, వైరా సీట్లను కోరాయి… చిరవకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఒప్పించి చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించింది …అందుకు కమ్యూనిస్టులు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం …

కొత్తగూడెం నుంచి …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీచేయనుండగా చెన్నూరు నుంచి పోటీచేయనున్నారు చంద్రశేఖర్ , సిపిఎం కు కేటాయించిన మిర్యాలగూడెం నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పోటీచేయనుండగా , వైరా నుంచి భూక్యా వీరభద్రం పోటీచేయనున్నట్లు సమాచారం అయితే ఆపార్టీలు వారి పేర్లను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది…

కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కమ్యూనిస్టులు కోరే సీట్లపై అభ్యంతరం పెట్టడంతో జాతీయ నాయకత్వాల జోక్యంతో సమస్య పరిష్కరమైంది. దీంతో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కల్సి ఈ ఎన్నికల్లో బీఆర్ యస్ ఓటమే ద్యేయంగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు . ఇందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని అనుకున్నట్లు సమాచారం … రాష్ట్రంలో ఉభయ కమ్యూనిస్టులకు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో 5 వేల నుంచి 10 వేలకు పైగా ఓట్లు ఉంటాయనే అంచనా ఉండటంతో రేపు హోరా హోరీగా జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కీలకం కానున్నాయి… ఇది బీఆర్ యస్ కు మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకుల అభిప్రాయం….

Related posts

ప్రజాస్వామ్య దేశాలు ఇంట‌ర్నెట్‌ విచ్ఛిన్నతకు ఎదురొడ్డాలి: సుందర్‌ పిచాయ్!

Drukpadam

కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి!

Drukpadam

నూతన మండలంగా ‘ఇనుగుర్తి’…సీఎం ఆదేశాలు …ఫలించిన ఎంపీ వద్దిరాజు కృషి !

Drukpadam

Leave a Comment