Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీజేపీలో తనకు అన్యాయం జరిగింది …పార్టీని వీడతా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి…!

టిక్కెట్ వస్తుందని యోగి ఆదిత్యనాథ్‌ను కూడా ప్రచారానికి ఆహ్వానించా: బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు

  • ఇంకా బీజేపీకి రాజీనామా చేయలేదు… కానీ త్వరలో వీడుతానన్న జిల్లా అధ్యక్షురాలు రమాదేవి
  • ఇద్దరు దుష్టశక్తులు తనపై కుట్ర పన్నారని మండిపాటు
  • స్థానికంగా ఉన్న తనను పక్కన పెట్టి వేరేవాళ్లకు టిక్కెట్ ఇవ్వడమేమిటని నిలదీత

తనకు ముథోల్ టిక్కెట్ వస్తుందని భావించానని, ఆ ఆశతోనే తన నియోజకవర్గంలో ప్రచారం కోసం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కూడా ఆహ్వానించానని నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి అన్నారు. ఆమె టీవీ9తో మాట్లాడుతూ… తాను ఇంకా బీజేపీకి రాజీనామా చేయలేదన్నారు. అయితే త్వరలో పార్టీని వీడుతానని చెప్పారు. పార్టీలో ఇద్దరు దుష్టశక్తులు తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. ముథోల్ టిక్కెట్ వస్తుందని ఎన్నోఆశలు పెట్టుకున్నానని చెప్పారు.

అందుకే యూపీ సీఎంను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. పార్టీని పెంచి పోషించిన తనను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ తనకు అన్యాయం చేసిందన్నారు. తనకు టిక్కెట్ రాకపోయిన విషయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సంబంధం లేదన్నారు. రామారావు పాటిల్ పవార్ డబ్బులు ఇచ్చి వచ్చారన్నారు. స్థానికంగా ఉన్న తనను పక్కన పెట్టి వేరేవాళ్లకు టిక్కెట్ ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు.

Related posts

రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి, అధికారం ఖాయం… సీఎల్పీ నేత భట్టి !

Ram Narayana

చివరి నిమిషంలో ఈ అభ్యర్థులను మార్చిన బీజేపీ, కాంగ్రెస్

Ram Narayana

ఖమ్మం ,హైద్రాబాద్ ,కరీంనగర్ ఎంపీ సీట్లపై రేపే కాంగ్రెస్ కీలక నిర్ణయం …!

Ram Narayana

Leave a Comment