ప్రజల తీర్పుతో హుందాగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నాను: కేసీఆర్
- వచ్చే నెల 16వ తేదీ వరకు మన ప్రభుత్వానికి అవకాశం ఉందన్న కేసీఆర్
- కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని ఎమ్మెల్యేలకు సూచన
- త్వరలో శాసన సభా పక్ష నేతను ఎన్నుకుందామన్న కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే నెల 16వ తేదీ వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ప్రజల తీర్పు నేపథ్యంలో హుందాగా తప్పుకున్నట్లు చెప్పారు. కొత్త ప్రభుత్వానికి మనం సహకరిద్దామని… ఏం జరుగుతుందో చూద్దామన్నారు. త్వరలో తెలంగాణ భవన్‌లో పార్టీ సమావేశం ఉంటుందని, ఫలితాలపై సమీక్ష ఉంటుందని వెల్లడించారు. త్వరలో పార్టీ శాసన సభా పక్ష నేతను ఎన్నుకుందామన్నారు.