Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు త్రీబుల్ ధమాఖా …భట్టి ,తుమ్మల, పొంగులేటికి కీలక పదవులు ..

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఈసారి కొత్తగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురు కీలక నేతలకు క్యాబినెట్ బెర్తులు దక్కే అవకాశం ఉందని సమాచారం …గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జిల్లా నుంచి ముగ్గురు హేమాహేమీలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైయ్యారు …సీఎం పదవికోసం పోటీపడ్డ మధిర శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గ చరిత్రలో ఎవరికీ రానంతటి మెజార్టీ 35 మెజార్టీతో గెలుపొందారు …ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న భట్టి చివరకు అధిష్టాన విజ్ఞప్తి మేరకు డిప్యూటీ సీఎం పదవికి ఒప్పుకున్నారు … ఆయనకు కీలకమైన పోర్ట్ పోలియో దక్కనున్నది …దీంతోపాటు టీపీసీసీ అధ్యక్ష పదవి కూడా కట్టబెట్టనున్నారని వార్తలు వస్తున్నాయి… ఇక మాజీమంత్రి రాజకీయ దురంధరుడు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి 49 వేల మెజార్టీతో ఎన్నికైయ్యారు … జిల్లా కేంద్రమైన ఖమ్మం నుంచి పోటీచేసిన తుమ్మల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఓడించారు …రాష్ట్రంపై పట్టు , ఆపార అనుభవం ఉన్న తుమ్మల సేవలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటుందనేది చూడాలి ..ఆయనకు రోడ్లు భవనాలు , ఇరిగేషన్ శాఖపై మంచి పటు ఉంది …లేదా ఆయన అనుభవాన్ని వయసును దృష్టిలో పెట్టుకొని స్పీకర్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది…ఇక జిల్లాలో సంచలన రాజకీయ నాయకుడిగా పేరొందిన డైనమిక్ లీడర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నుంచి పోటీచేసు జిల్లాలోనే అత్యధిక ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు …ఖమ్మం జిల్లాలో పొంగులేటి కాంగ్రెస్ లో చేరిన తర్వాతనే కార్యకర్తలు ఉరుకులు పరుగులు పెట్టారు ..ఎన్నికలకు కొన్ని రోజులకు ముందు మరో ముఖ్యనేత మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరడం సంచలనంగా మారింది …తుమ్మల ,పొంగులేటి కాంగ్రెస్ లో చేరిక ఆపార్టీకి కొత్త బలాన్ని ఇచ్చింది…దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క భద్రాచలం మినహా సిపిఐకి కేటాయించిన స్థానంతో సహా మొత్తం స్థానాలను గెలుచుకుంది..రాష్ట్రంలోనే పొంగులేటి ,జూపల్లి కాంగ్రెస్ లో చేరిక కాంగ్రెస్ బలాన్ని పెంచింది …పొంగులేటితోపాటు తన మనుషులుగా ఉన్న ముగ్గురికి సీట్లు ఇప్పించుకొని వారిని గెలిపించుగాలిగారు ….అందువల్ల పొంగులేటి మంత్రి పదవి ఇస్తారని సమాచారం …ఒక వేల ఏదైనా కారణాల రీత్యా తుమ్మల ,పొంగులేటి మంత్రిపదవులు ఇవ్వలేకపోతే కీలక పదవులు లభించే అవకాశం ఉంది …అయితే జిల్లా నుంచి మొదటి విడతలో ఒక్క భట్టకే ఛాన్స్ ఉంటుందని మిగతావారికి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా అవకాశం కల్పించవచ్చునని తెలుస్తుంది…

Related posts

ఖమ్మంలో పోటీకి పొంగులేటి జంకుతున్నారా….?

Ram Narayana

పాలేరులో పొంగులేటి …ఖమ్మంలో తుమ్మల పోటీ ఖరారు ….!

Ram Narayana

షర్మిల డిస్సప్పాయింట్మెంట్ …కాంగ్రెస్ తో పార్టీ విలీనం అనుమానమే …?

Ram Narayana

Leave a Comment