Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

పారిశ్రామిక వాడల కోసం 1000 ఎకరాల భూములు గుర్తించండి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం

  • విమానాశ్రయాలకు, జాతీయ రహదారులకు 100 కి.మీ. లోపు ఉండేలా చూడాలని సూచన
  • బంజరు భూములై ఉండటంతో పాటు సాగుకు యోగ్యం కానివై ఉండాలన్న సీఎం
  • కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ముఖ్యమంత్రి

తెలంగాణలో నూతన పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం ఓఆర్ఆర్‌కు వెలుపల, ఆర్ఆర్ఆర్‌కు లోపల 500 నుంచి 1000 ఎకరాల భూమిని గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు. ఆ భూములు కూడా విమానాశ్రయాలకు, జాతీయ రహదారులకు వంద కిలో మీటర్ల లోపు ఉండేలా చూడాలని సూచించారు. 

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిపై సోమవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… పరిశ్రమల కోసం సేకరించే భూములు బంజరు భూములై ఉండటంతో పాటు సాగుకు యోగ్యం కానివి అయి ఉండాలన్నారు.

రైతులకు ఎలాంటి నష్టం లేకుండా… కాలుష్యం తక్కువగా ఉండేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. అదే సమయంలో పరిశ్రమలకు కేటాయించినప్పటికీ… ఉపయోగించకుండా ఉన్న వాటిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని, హైదరాబాద్‌లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామికవాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలన్నారు.

రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన దానకిశోర్, ఆమ్రపాలి

  • సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన అధికారులు
  • అధికారంలోకి వచ్చాక అధికారుల బదిలీలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
  • హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలికి బాధ్యతలు
Dana Kishore and  Amrapali Kata IAS calls on Chief Minister Revanth Reddy

ఐఏఎస్ అధికారులు దానకిశోర్, ఆమ్రపాలి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్‌గా దానకిశోర్‌ను, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌‌గా ఆమ్రపాలిని నియమించింది. అయితే నిన్న అధికారుల బదిలీల క్రమంలో దానకిశోర్‌ను ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ ఎండీగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో సచివాలయంలో వారు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికారుల బదిలీలు చేపట్టింది. ఈ క్రమంలో గత శుక్రవారం ఆమ్రపాలి హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గానూ ఆమె బాధ్యతలు స్వీకరించారు.

Related posts

సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లపై ఐటీ దాడులు

Ram Narayana

డిప్యూటీ సీఎం భట్టి నివసిస్తున్న ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు …

Ram Narayana

కుమార్తె అరెస్ట్ అయి నేటికి నెల రోజులు.. ఇప్పటి వరకు పరామర్శించని కేసీఆర్..

Ram Narayana

Leave a Comment