Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

‘గే’ పురుషులకు నెలసరి ఉంటుందా? కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సూటి ప్రశ్న

  • ‘నెలసరిలో మహిళల ఆరోగ్యం’ అంశంపై రాజ్యసభలో చర్చ
  • ఈ అంశంలో ప్రభుత్వ విధానాలను ఎల్‌జీబీటీక్యూఐఏ+ వర్గానికి వర్తిస్తారా? అంటూ ఆర్జేడీ ఎంపీ ప్రశ్న
  • ఆర్జేడీ ఎంపీ ప్రశ్నపై తాజాగా స్పందించిన కేంద్ర మంత్రి 
  • జనాల దృష్టిని ఆకర్షించేందుకు ఎంపీ ఇలాంటి ప్రశ్న వేసుండొచ్చని కామెంట్
Which gay man has menstrual cycle Smriti Irani

‘నెలసరిలో మహిళల ఆరోగ్యం’ అంశంపై దేశంలో చర్చ కొనసాగుతోంది. ఈ విషయంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్‌ 13న రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆర్‌జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా..మహిళల్లో నెలసరి ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వ విధానంపై ఓ ప్రశ్న సంధించారు. ఎల్‌జీబీటీక్యూఐఏప్లస్ వర్గానికి ప్రభుత్వ విధానాలను వర్తింపజేస్తారా? అని ప్రశ్నించారు. 

దీనిపై స్మృతీ ఇరానీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గర్భాశయం లేని గే మగాళ్లకు నెలసరి ఉంటుందా?’’ అని ప్రశ్నించారు. జనాల దృష్టిని ఆకర్షించేందుకో లేక సంచలనం సృష్టించాలన్న ఉద్దేశంతోనో ఎంపీ ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని స్మృతి ఇరానీ అభిప్రాయపడ్డారు.

Related posts

 పీవోకే కోసం 24 సీట్లు రిజర్వ్ చేశాం… కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Ram Narayana

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు: ఎల్లుండి మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం!

Ram Narayana

 పీఎం కిసాన్ మొత్తం పెంపు అంశంపై కేంద్రం స్పందన

Ram Narayana

Leave a Comment