తెలంగాణ వార్తలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని

  • తెలంగాణ ఉద్యమం సమయంలో డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన నళిని
  • ఇటీవల నళినికి అదే ఉద్యోగం లేదా ఆ స్థాయి ఉద్యోగం ఆఫర్ చేసిన ముఖ్యమంత్రి
  • సున్నితంగా తిరస్కరించిన నళిని
  • నేడు సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నళిని
Former DSP Nalini meets cm Revanth Reddy

మాజీ డీఎస్పీ నళిని శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె వివిధ అంశాలపై చర్చించారు. ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం నళిని తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… నళిని పేరును ప్రస్తావించారు.

పోలీసు అధికారులతో జరిగిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న నళినికి తిరిగి డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని లేదంటే అదే స్థాయి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. కానీ తాను ప్రస్తుతం పూర్తి ఆధ్యాత్మిక చింతనతో ఉన్నానని.. తాను ఫిట్ కూడా కాదని.. అందుకే ఉద్యోగాన్ని తిరస్కరిస్తున్నట్లు నళిని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రిని ఆమె కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related posts

తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఎప్పుడో చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్!

Ram Narayana

ఆ డబ్బుతో కేసీఆర్ విదేశాలకు పారిపోతారు.. భూములు కొన్నవారు జాగ్రత్త: రేవంత్ హెచ్చరిక

Ram Narayana

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన ఇన్నోవా కారు!

Ram Narayana