- శనివారం సచివాలయంలో సీఎంను కలిసిన నందమూరి హీరో
- బాలకృష్ణతో పాటు సీఎంను కలిసిన బసవతాకరం ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు
- అంతకుముందు సీఎంను కలిసిన పీవీ సింధు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సచివాలయంలో రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి పలకరించారు. సీఎంను కలిసినవారిలో బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు, తదితరులు ఉన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పలువురు సీపీఎం నేతలు ముఖ్యమంత్రిని కలిశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: