Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

బంగ్లాదేశ్ యువతిపై హత్యాచారం.. ప్రధాన నిందితుడిపై పోలీసుల కాల్పులు…

బంగ్లాదేశ్ యువతిపై హత్యాచారం.. ప్రధాన నిందితుడిపై పోలీసుల కాల్పులు
-మానవ అక్రమ రవాణా ద్వారా బంగ్లాదేశ్ యువతి నిర్బంధం
-ఆపై బలవంతంగా వ్యభిచారంలోకి
-ప్రధాన నిందితుడితో బాధిత యువతికి ఆర్థిక వివాదాలు
-అత్యాచారం చేసి హత్య

బంగ్లాదేశ్ యువతిపై హత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు పోలీసులపైకి దాడికి యత్నించడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. కర్ణాటకలో జరిగిందీ ఘటన. ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్‌కు చెందిన 22 ఏళ్ల యువతిని షాబాజ్ అనే వ్యక్తి మానవ అక్రమ రవాణా ద్వారా బంధించి బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆర్థిక వివాదాలు మొదలయ్యాయి. దీనిని సహించలేని షాబాజ్ మరికొందరితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడైన షాబాజ్ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అతడు శ్రీరాంపూర్‌లోని ఓ తుక్కు గోదాములో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు వెళ్లిన పోలీసులపై నిందితుడు షాబాజ్ కత్తి చూపించి బెదిరించడమే కాకుండా వారిపై దాడికి దిగాడు. ఈ క్రమంలో హెడ్‌కానిస్టేబుల్, ఎస్ఐ గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు ప్రారంభించారు. కాల్పుల్లో గాయపడిన నిందితుడిని చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశారు.

Related posts

హైదరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి వాహనం చోరీ!

Drukpadam

ఎ బి వెంకటేశ్వరరావు పై చర్యలకు ఏపీ సర్కార్ నిర్ణయం

Drukpadam

సంపులో నోట్ల కట్టలు.. అడ్డంగా దొరికిపోయిన రాజకీయనాయకుడు.. డ్రయ్యర్ తో ఆరబెట్టి, ఇస్త్రీ చేసిన అధికారులు..

Drukpadam

Leave a Comment