Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

 తైవాన్ పై చైనా దురాక్రమణకు పాల్పడితే జరిగే ఆర్థిక నష్టం ఎంతో తెలుసా…!

  • తైవాన్ తన భూభాగమే అంటున్న చైనా
  • తైవాన్ పై చైనా దండెత్తితే రూ.830 లక్షల కోట్ల నష్టం తప్పదన్న బ్లూంబెర్గ్
  • ప్రపంచ జీడీపీలో ఇది 10 శాతం అని వెల్లడి

తైవాన్ ను కబళించడానికి చైనా కాచుకుని కూచుందన్న సంగతి తెలిసిందే. ఆమెరికా లేకపోతే ఆ పని ఎప్పుడో జరిగేది! ఇక అసలు విషయానికొస్తే… అంతర్జాతీయ ఆర్థికపరమైన అంశాల మీడియా సంస్థ బ్లూంబెర్గ్ ఆసక్తికర అంశం వెల్లడించింది. 

ఇప్పటికిప్పుడు తైవాన్ పై చైనా దురాక్రమణకు పాల్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం చూపుతుందో బ్లూంబెర్గ్ వివరించింది. దాదాపు రూ.830 లక్షల కోట్ల మేర నష్టం తప్పదని అంచనా వేసింది. ఇది ప్రపంచ జీడీపీలో 10 శాతం అని వివరించింది. 

తైవాన్ పై చైనా దండెత్తితే… కొవిడ్ సంక్షోభం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ప్రపంచ ఆర్థిక సంక్షోభాలను మించిన సంక్షోభం తలెత్తుతుందని బ్లూంబెర్గ్ పేర్కొంది.

Related posts

తుపాకీ చేతపట్టి అమెరికా వీధుల్లో యువతి లొల్లి..

Ram Narayana

పాక్ సైనిక పాలకుడు ముషారఫ్ కు ‘మరణానంతరం మరణ శిక్ష’!

Ram Narayana

దేశంలో ఆకలి కేకలంటూ అంతర్జాతీయ నివేదిక.. భారత్ గుస్సా!

Ram Narayana

Leave a Comment