Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

రైతుబంధుపై ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది: శుభవార్త చెప్పిన తుమ్మల

  • రేపటి నుంచి దశలవారీగా రైతులకు రైతుబంధు నిధులు అందిస్తామని వెల్లడి
  • రెండు లక్షల రైతుల రుణమాఫీని దశలవారీగా ఖాతాల్లో జమ చేస్తామని వివరణ  
  • తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందేనంటూ వ్యాఖ్య

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు శుభవార్త చెప్పారు. రైతుబంధు కోసం లక్షలాది మంది రైతులు వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల ఊరట కలిగించే విషయాన్ని చెప్పారు. తుమ్మల ఈ రోజు నిజామాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైతుబంధు నిధుల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు. రేపటి నుంచి దశలవారీగా రైతులకు నిధులు అందిస్తామని, ఈ నెలాఖరులోగా అందరికీ ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే రెండు లక్షల రైతుల రుణమాఫీని దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందేనని… అయినప్పటికీ రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగ సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు అన్నారు. నేటికీ ఎన్టీఆర్ తనకు ఆదర్శప్రాయుడన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకు వచ్చారని కితాబునిచ్చారు.

Related posts

అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులా…? ఇందులో ఎన్ని గంటలు చర్చ …?

Ram Narayana

ప్రత్యామ్నాయ విద్యుత్ అందించేందుకు వారు పునాదులు వేశారు: మల్లు భట్టి విక్రమార్క

Ram Narayana

రాష్ట్రంలో 27,862 విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా: భట్టివిక్రమార్క

Ram Narayana

Leave a Comment