Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

రేపు భద్రాచలంలో బీజేపీ జాతీయనాయకుడు పొంగులేటి

అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా భద్రాచలంలో రామాయలన్ని సందర్శించి పూజలు చేయనున్నట్లు బీజేపీ జాతీయనాయకులు తమిళనాడు సహా ఇంచార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు …శనివారం తమిళనాడు లో ప్రధానితో కలిసి పర్యటన చేసిన సందర్భంగా తాను భద్రాచలం వెళుతున్నానని చెపితే భద్రాద్రి రాముడి ఆశీస్సులు ప్రధాని మోడీ కోరారని ,ప్రజలందరికి శుభాకాంక్షలు చెప్పారని అన్నారు ..ఆదివారం ఖమ్మం వచ్చిన సుధాకర్ రెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ..అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ప్రతి ఇంట్లో ఐదు రామదీపాలు వెలిగియాలని కోరారు …రాముడు అందరి వాడు కాబ్బటి అన్ని మతాలవారు పాల్గొనాలన్నారు … 500 సంవత్సరాల భారతీయుల కల నెరవేరాబోతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు .

తెలంగాణ రాజకీయాలపై మాట్లాడుతూ …పవర్ సెక్టర్ స్కామ్, కాళేశ్వరం ప్రాజెక్టు పై సిబిఐ తో విచారణ జరిపించాలి.అవసరం అయితే బీజేపీ సహకరిస్తుందని అన్నారు ..
మంత్రి తుమ్మల నాగేశ్వరావు రైతులు లోన్ కట్టాల్సిందే అన్నట్లు చూశామని ఇది దుర్మార్గమని అన్నారు ..రైతులకు రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటతప్పడం సరైంది కాదన్నారు ..ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు .అంతకు ముందు దేవాలయం పరిశుభ్రత కార్యక్రంలో పాల్గొని ఆలయాన్ని పొంగులేటి శుభ్రం చేశారు ..

ఖమ్మం పార్లమెంట్ కీ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ గెలుస్తుంది. గల్లా సత్యనారాయణ ..

బీజేపీ పార్టీ కీ అవకాశం ఇవ్వండి బిఆరెస్ వాళ్లు ఎన్నికలు అయిపోయ్యాక పారిపోయారు.ఇక వాళ్లకు చోటులేదు …బీజేపీని ఆదరించండి అని బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ అన్నారు ..ఇక రాజకీయాలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గానే ఉంటాయని అందువల్ల నరేద్రమోడీ ని ఆశీర్వదించి బీజేపీ ని గెలిపించాలని కోరారు .

Related posts

మంత్రి తుమ్మలకు శుభాకాంక్షల వెల్లువ …జనంతో కిక్కిరిసిన శ్రీసిటీ …

Ram Narayana

కీంకర్తవ్యం … ఖమ్మం కాంగ్రెస్ నేతల సమాలోచనలు…

Ram Narayana

జర్నలిస్టులకు ఉచితంగా హోమియో మందులు పంపిణీ

Ram Narayana

Leave a Comment