Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

మేఘాలయ పైనాపిల్స్ రుచి చూసిన రాహుల్ గాంధీ

  • భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ
  • మేఘాలయలో కొనసాగుతున్న పాదయాత్ర
  • ఓ పండ్ల దుకాణాన్ని సందర్శించిన రాహుల్ 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాదయాత్ర మేఘాలయ రాష్ట్రంలో సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మేఘాలయలోని ఓ గ్రామంలో ఉన్న పండ్ల దుకాణాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న ఫలాలను ఆసక్తిగా తిలకించారు. అంతేకాదు, నోరూరించే మేఘాలయ పైనాపిల్స్ ను రుచిచూశారు. దీనికి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. మేఘాలయ పైనాపిల్స్ ప్రపంచంలోనే రుచికరమైనవని కాంగ్రెస్ పేర్కొంది.

Related posts

ఢిల్లీ లిక్కర్ స్కాం కథాకమామీషు …

Drukpadam

కర్ణాటకలో హిజాబ్‌పై నిషేధం ఎత్తివేత

Ram Narayana

ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ బిబేక్ దెబ్రాయ్ కన్నుమూత

Ram Narayana

Leave a Comment