Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బేగంపేట విమానాశ్రయంలో ఖర్గేకు రేవంత్ రెడ్డి ఘన స్వాగతం

  • ఎల్బీ స్టేడియంలో బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం
  • సమావేశానికి హాజరవుతున్న మల్లికార్జున ఖర్గే
  • సమావేశంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి, దీపా దాస్ మున్షీ, మల్లు భట్టి తదితరులు

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఖర్గే నగరానికి వచ్చారు. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఖర్గేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీ కేడర్‌కు ఖర్గే దిశా నిర్దేశనం చేయనున్నారు. ఈ సమావేశంలో ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, నాయకులు పాల్గొననున్నారు.

 

Related posts

 ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కోదండరాంను ఎలా ఆమోదించారు?: గవర్నర్‌కు కేటీఆర్ ప్రశ్న

Ram Narayana

నేను పదేళ్లు సీఎంగా ఉన్నా… ఫోన్ ట్యాపింగ్‌పై కచ్చితంగా క్లారిటీ ఇస్తా: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Ram Narayana

తెలంగాణ పీసీసీ ఫీఠంపై పీటముడి ..

Ram Narayana

Leave a Comment