Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ యస్ 16 ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఫైనల్…

బీఆర్ యస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ నుంచి పోటీచేసే లోకసభ అభ్యర్థులను ఫైనల్ చేశారు … రాష్ట్రంలో మొత్తం 17 లోకసభ స్తనాలు ఉండగా ఒక్క హైద్రాబాద్ మినహా శనివారం తో అన్ని లోకసభ సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు ….ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ యస్ నుంచి పోటీచేసేందుకు అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు …కొందరు ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పారు …ప్రధానంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి , వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ , నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బి బి పాటిల్ ,వారిలో ఉన్నారు …మరికొంతమంది పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది … నామినేషన్లు వేసేనాటికి ఎందరు ఉంటారు అనేది ప్రస్నార్ధకమే అంటున్నారు పరిశీలకులు …లోకసభ పక్ష నేత నామ నాగేశ్వరావు బీజేపీలో చేరి ఖమ్మం నుంచి ఎన్డీయే అభ్యర్థిగా పోటీచేస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఖండించారు …అయితే అందులో ఏమైనా తిరకాసు ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి…

బీఆర్ యస్ లోకసభ అభ్యర్థుల జాబితా …

ఖమ్మం ….నామ నాగేశ్వరావు
మహబూబాబాద్ …మాలోతు కవిత
వరంగల్ ….. కడియం కావ్య
కరీంనగర్ ….బోయినపల్లి వినోద్ కుమార్
పెద్దపల్లి ….కొప్పుల ఈశ్వర్
ఆదిలాబాద్ …ఆత్రం సక్కు
నిజామాబాద్ ….బాజిరెడ్డి గోవర్ధన్
మెదక్ ….. వెంకట్రామ్ రెడ్డి
జహీరాబాద్ ….గాలి అనిల్ కుమార్
చేవెళ్ల……….. కాసాని జ్జానేశ్వర్
మహబూబ్ నాగర్ మన్నే శ్రీనివాస్ రెడ్డి
నాగర్ కర్నూల్ ….ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
నల్గొండ ….కంచర్ల కృష్ణారెడ్డి
మల్కాజిగిరి ……రాగిడి లక్ష్మారెడ్డి
సికింద్రాబాద్ …..పద్మారావు గౌడ్
భువనగిరి …..క్యామ మల్లేష్ ..

Related posts

తుమ్మల తాడో ….పేడో….జిల్లాలో రాజకీయ ప్రకంపనలు ….

Ram Narayana

సికింద్రాబాద్ బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థిగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

Ram Narayana

అరికెపూడి వర్సెస్ కౌశిక్ రెడ్డి… హరీశ్ రావు హౌస్ అరెస్ట్

Ram Narayana

Leave a Comment