Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

అసోంలోని ఆ గ్రామమంతా ఒకే కుటుంబం… 1200 మంది ఓటర్లు ఉన్నారు!

  • సోనిత్‌పూర్ జిల్లా నేపాలీపామ్ గ్రామంలో అందరూ రాన్ బహదూర్ థాపా వారసులే
  • రాన్ బహదూర్‌కు ఐదుగురు భార్యలు, 22 మంది పిల్లలు
  • గ్రామంలోని 300 కుటుంబాలు ఆయన వారసత్వమే

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అసోంలోని సోనిత్‌పూర్ జిల్లా నేపాలిపామ్ గ్రామం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఈ గ్రామంలోని 300 కుటుంబాల వారు ఒకే పరంపరకు చెందినవారు. వీరంతా రాన్ బహదూర్ థాపా వారసులు. రాన్ బహదూర్ థాపా ఒక గూర్ఖా. అతను సోనిత్‌పూర్ నదీతీరానికి వచ్చి స్థిరపడ్డాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించాడు.

అయితే అతనికి ఐదుగురు భార్యలు… 12 మంది కొడుకులు, 10 మంది కూతుళ్లు ఉన్నారు. రాన్ బహదూర్ థాపా 1997లో చనిపోయాడు. ఇప్పుడు ఆయన కుటుంబం క్రమంగా విస్తరించి, కుటుంబ సభ్యుల సంఖ్య 2500కి పెరిగింది. అందులో 1200 మంది ఓటర్లు ఉండడం విశేషం.

నేపాలి పామ్ గ్రామం తేజ్‌పూర్ నియోజకవర్గం పరిధిలో ఉంది. వీరి కుటుంబం పెరిగిన కొద్దీ… క్రమంగా ఇతర కుటుంబాలుగా విడిపోయాయి. కానీ అదే ప్రాంతంలో ఉండిపోయాయి. ఈ గ్రామమే నేపాలి ఫామ్.

తన తండ్రి ఐదు పెళ్లిళ్లు చేసుకున్నారని… ఆయనకు తాము మొత్తం 22 మంది పిల్లలం ఉన్నామని రాన్ బహదూర్ థాఫా పెద్ద కొడుకు చెప్పారు. అయితే తమ కుటుంబం పెరిగినా కొద్దీ ఎవరికి వారు కుటుంబాలుగా విడిపోయామని చెప్పారు. మా కొడుకులు, మనవళ్లు, కూతుళ్లు, మనవరాళ్లు కూడా పెళ్లిళ్లు చేసుకున్నారని, వారికీ పిల్లలు ఉన్నారని తెలిపారు. తమ గ్రామంలో మొత్తం 300 కుటుంబాలు ఉన్నాయన్నారు. మా గ్రామంలో తన తండ్రి వారసత్వమే ఉందని, ఇతరులు ఎవరూ లేరన్నారు.

Related posts

స్వాతంత్ర దినోత్సవానికి ప్రత్యేక అతిథులుగా 1800 మంది సామాన్యులు

Ram Narayana

ఢిల్లీ జేఎన్‌యూ స్టూడెంట్ ప్రెసిడెంట్‌గా దళిత విద్యార్థి ధనంజయ్

Ram Narayana

రాజస్థాన్ ప్రభుత్వ బిల్డింగ్ బేస్ మెంట్ లో నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లు!

Drukpadam

Leave a Comment