Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గింపుతో డెల్టా వేరియంట్‌కు చెక్‌!

రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గింపుతో డెల్టా వేరియంట్‌కు చెక్‌!
  • -లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం
  • -ఫైజర్‌ ఒక్క డోసుతో తక్కువ యాంటీబాడీలు
  • -వీలైనంత త్వరగా రెండో డోసు ఇవ్వాలని సూచన
  • -అవసరమైతే బూస్టర్‌ డోసు కూడా ఇవ్వాలని హితవు

భారత్‌లో వెలుగుచూసిన డెల్టా వేరియంట్‌(బి.1.617.2)పై ఫైజర్‌ టీకా సామర్థ్యం తక్కువేనని లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. ఒరిజినల్‌ వేరియంట్‌పై టీకా చూపుతున్న ప్రభావంతో పోలిస్తే డెల్టా రకాన్ని ఎదుర్కొనడంలో చూపుతున్న ప్రభావం తక్కువని తెలిపింది. డెల్టా వేరియంట్‌పై పోరాడే యాంటీబాడీలు చాలా తక్కువ స్థాయిలో విడుదలవుతున్నట్లు వెల్లడించింది. ఇక ఓకే డోసు తీసుకున్న వారిలో డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనే సామర్థ్యం మరింత తక్కువని స్పష్టం చేసింది.

ఫైజర్‌ తొలి డోసు తీసుకున్న వారిలో 79 శాతం మందిలో ఒరిజినల్‌ స్ట్రెయిన్‌ను నిర్వీర్యం చేయగలిగే యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని అధ్యయనం తెలిపింది. ఇక యూకేలో వెలుగుచూసిన ఆల్ఫా వేరియంట్‌(బి.1.1.7)ను ఎదుర్కొనే యాంటీబాడీలు 50 శాతం మందిలో, డెల్టా వేరియంట్‌తో పోరాడే యాంటీబాడీలు 32 శాతం మందిలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన బి.1.351 వేరియంట్‌ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలు 25 శాతం మందిలో ఉత్పత్తి అయినట్లు వెల్లడించింది.

ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా ప్రజలకు అందజేయాలని అధ్యయనం సూచించింది. అలాగే రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించి వీలైనంత త్వరగా రెండో డోసు అందించడంతో పాటు రోగనిరోధకత తక్కువ ఉన్న వారికి బూస్టర్‌ డోసు కూడా ఇవ్వడమే కొత్త రకాలను ఎదుర్కోవడానికి మేలైన మార్గమని అధ్యయనం సూచించింది.

Related posts

ఏపీలో నైట్ కర్ఫ్యూ.. ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్

Drukpadam

రాహుల్ గాంధీ, బీజేపీ మధ్య కరోనా వ్యాక్సినేషన్ యుద్ధం!

Drukpadam

కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ఈ గ్యాడ్జెట్లు దగ్గర ఉంచుకుంటే ప్రయోజనమే!

Drukpadam

Leave a Comment