Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కంగ్రెస్ దే హవా: న్యూస్ ఎక్స్ సర్వే

  • 17 స్థానాల్లో కాంగ్రెస్ 8 సీట్లను గెలుచుకుంటుందన్న సర్వే
  • 5 స్థానాలను గెలుచుకోనున్న బీజేపీ
  • మూడో స్థానానికి పరిమితం కానున్న బీఆర్ఎస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ… లోక్ సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటబోతోందని న్యూస్ ఎక్స్ సర్వే తెలిపింది. మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ 8 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందని పేర్కొంది. తెలంగాణలో బలపడాలని భావిస్తున్న బీజేపీ తన లక్ష్యాలకు అనుగుణంగానే 5 స్థానాల్లో గెలుపొందుతుందని తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పింది. ఎంఐఎం పార్టీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంటుందని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్… లోక్ సభ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం కాబోతోందని చెప్పింది.

Related posts

కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో బీఆర్ యస్ ఎమ్మెల్యేతెల్లం…

Ram Narayana

మంత్రి సురేఖమ్మను చుట్టుముడుతున్న వివాదాలు…

Ram Narayana

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కేసీఆర్ అనుమతి అవసరం లేదు: కిషన్ రెడ్డికి సీబీఐ మాజీ డైరెక్టర్ సూచన

Ram Narayana

Leave a Comment