Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎలక్షన్ కమిషన్ వార్తలు

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 547 నామినేషన్లు

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 547 నామినేషన్లు
రేపు నామినేషన్ల ప్రక్రియ… 29వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు
మే 13న పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాలు
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాలకు 120కి పైగా నామినేషన్లు
తెలంగాణలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం ముగిసింది. 17 లోక్ సభ స్థానాలకు గాను 547 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 18న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు డమ్మీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలామంది నామినేషన్లు దాఖలు చేశారు. రేపు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ… 29వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మే 13న పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

ఖమ్మం లోక్ సభ స్థానానికి 29 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాలకు 120కి పైగా నామినేషన్లు వచ్చాయి. ఈరోజు చివరి రోజు… దీనికి తోడు మంచి రోజు కావడంతో ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. కొంతమంది అభ్యర్థులు రెండు లేదా మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడి నుంచి 13 నామినేషన్లు దాఖలయ్యాయి.

-మే 27 న ఎన్నికలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూలు విడుదలైంది.వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు మే 2 న నోటిఫికేషన్ ఇవ్వనుంది. మే 2 నుంచి 9 వరకు నామినేషన్లు స్వీకరించనుంది. మే 13 వరకు నామినేషన్ల ఉపసంహరణ మే 27న పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

25 లోక్‌సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినే షన్‌ దాఖలు చేశారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 4,210 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేశారు.శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్‌ ఉపసంహ రణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది.

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పులి వెందుల అసెంబ్లీ స్థానానికి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు…

Related posts

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు సొంత కారే లేదట!

Ram Narayana

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా

Ram Narayana

 ‘వికసిత భారత్’ వాట్సాప్ సందేశాలకు బ్రేకులు వేసిన ఎన్నికల సంఘం

Ram Narayana

Leave a Comment