Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

నామా..కేంద్ర మంత్రి ఎలా అవుతాడో చెప్పాలి ..మంత్రులు భట్టి,

బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం లాంటిదని..రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. మంగళవారం మధిర మండలం దెందుకూరు శ్రీరస్తు కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ సమావేశం లో మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో 15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రామ సహాయం రఘురాoరెడ్డికి భారీ మెజారిటీ అందించాలని కోరారు. ఖమ్మం పర్యటలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి నామా గెలిస్తే కేంద్రంలో మంత్రి అవుతాడని ప్రకటించారని, నామానీ ఎలా మంత్రిని చేస్తారో కేసీఆర్ వివరించాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రాయల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సీనియర్ నాయకులు ఐలూరి వెంకటేశ్వర రెడ్డి, మద్దినేనీ స్వర్ణ కుమారీ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కోటా రాంబాబు, ఎంపీపీ మెండెం లలిత తదితరులు పాల్గొన్నారు.

Related posts

నేను జైలుకు వెళ్లడానికి ఎర్రబెల్లి దయాకర్ రావు కారణం: రేవంత్ రెడ్డి

Ram Narayana

కాంగ్రెస్ అభ్యర్థుల నాల్గొవ జాబితా …సూర్యాపేట లో పటేల్ రమేష్ రెడ్డికి మళ్ళీ నిరాశ…

Ram Narayana

షబ్బీర్ చేతిలో కేసీఆర్‌కు ఓటమి ఖాయం: రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment