Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మం ఫలితంపై నామ విశ్వాసం …ఫలితం అనూహ్యంగా ఉంటుందని ధీమా..!

మన ఖమ్మం ప్రజలు చైతన్యవంతమైన వారు …వారు దీవెనలు నాకు కొండంత అండగా ఉన్నాయి…విజ్ఞతతో ఓటు వేస్తారని నమ్మకం నాకుంది … రాజకీయాల్లో ఎక్కడ మచ్చలేకుండా ,నీతిగా ,నిజాయితీగా వ్యవహరించానని బీఆర్ యస్ లోకసభ పక్ష నేత ఖమ్మం బీఆర్ యస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు … ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నామ “దృక్పథంతో ” ముచ్చటించారు … ఎన్నికల ప్రచారం బేషుగ్గా ఉంది …కార్యకర్తలు పట్టుదలతో పనిచేస్తున్నారు …ఎవరికీ వారు తామే అభ్యర్థులమన్నట్లు నన్ను అలర్ట్ చేస్తున్నారు …గ్రామస్థాయిలో ఉన్న నాయకులతో నేరుగా కాంటెక్ట్ పెట్టుకున్నాం …వారితో నిత్యం టెలీకాన్ఫెరెన్స్ లు నిర్వహిస్తున్నాం … మొన్న ఎన్నికల్లో ఓడిపోయినా మా అభ్యర్థులు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు …ఎక్కడికక్కడ తిరుగుతున్నారు …మీరే చూడండి ఫలితం అనూహ్యంగా ఉంటుందని అని నామ ధీమా వ్యక్తం చేశారు …

తన క్యారక్టర్ గురించి మాట్లాడుతూ కొన్ని విలువలతో ఉన్నవాణ్ని ఎక్కడ ప్రత్యర్థులను కించపరిచే విధంగా మాట్లాడలేదు …కొందరు మాట్లాడమని అన్న విధానాలపై కొట్లాడాలే కానీ వ్యక్తుల గురించి మాట్లాడవద్దని అన్నానని తెలిపారు …తాను టీడీపీలో ఉన్నా , బీఆర్ యస్ లో చేరినా, పార్టీ నాయకుడి మాట జవదాటకుండా వారి అడుగుజాడల్లో నడుచుకున్న వాణ్ణి … వారు అప్పగించిన భాద్యతలు తుచా తప్పకుండ అమలు జరిపాను ..

గత రెండు సార్లు పార్లమెంట్ లో తన పనితీరు చూశారు …బెస్ట్ పార్లమెంటేరియన్ గా ప్రసంశలు అందుకున్నవాణ్ణి …తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడినవాణ్ణి …రాష్ట్ర ఏర్పాటుకు మొదటి ఓటు వేసినవాణ్ణి … రైతుల ,కూలీల ,కార్మికుల ,యువకుల , మహిళల సమస్యలపై పార్టీ విధానానికి అనుగుణంగా పార్లమెంట్ లో తన గళం వినిపించిన వాణ్ణి … ఖమ్మం పార్లమెంట్ సభ్యుడిగా వచ్చిన అవకాశం ప్రజల సంక్షేమం ,రాష్ట్ర అభివృద్ధి ,ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంపై కేంద్రీకరించి పనిచేశాను …పార్టీలు ఏరైనా సమస్యల పరిష్కరంలో వారి మద్దతు కూడా గొట్టాను …. తన పనితీరు ఖమ్మం ప్రజలకే కాదు యావత్ దేశ ప్రజలు గమనించారు ….పార్లమెంట్ లో నాకు వచ్చిన అవకాశాలు అలాంటివి …టీడీపీ లో ఉన్నప్పుడు చంద్రబాబు , బీఆర్ యస్ లో కేసీఆర్ నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహించారు …అందుకే టీడీపీ లో ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరుపున , తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండవసారి పార్లమెంట్లోకి వెళ్లిన నేను పార్టీ పక్ష నాయకుడిగా వ్యవహరించడం గొప్ప అవకాశం లభించింది …మంచి అనుభూతి ఇచ్చింది …

ఈ ఎన్నికల్లో నాగెలుపుకు ప్రజల దీవెన కొండంత అండగా ఉంది …ఎక్కడకు వెళ్లిన నన్ను అశ్విరదించి అక్కున చేర్చుకుంటున్నారు ….కొందరు ఇతర పార్టీల నుంచి మద్దతు తెలపడం ఆశ్చర్యం కల్గిస్తుంది …నామ గారు మా ఓట్లు మీకే అంటున్నారు …నేను స్థానికుడిని నాలుగుసార్లు పోటీచేసి రెండు సార్లు గెలిచాను …జిల్లా మీద సంపూర్ణ అవగాహనా ఉంది ..జిల్లా అభివృద్ధికి నా వంతు కృషి చేశాను …జిల్లాకు 360 కీ .మీ పైన నేషనల్ హైవే లు తేవడంలో కీలక పాత్ర పోషించాను …ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధితోపాటు జిల్లాలో మనకే స్టేషన్ ల అభివృద్ధికి నా కృషి ఉంది …

కాంగ్రెస్ పథకాలు ప్రజలకు అందక పోవడంతో ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది …

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలని పట్టుదల కసితో ఉన్న ప్రజలే ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయని కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేశామా అని బాధపడుతున్నారని నామ అన్నారు …ఆకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు సహాయం లేదు …రైతు భరోసా ఇదిగో అదిగో అంటూ మాయమాటలు చెపుతున్నారని రైతులు ఆగ్రహంగా ఉన్నారు .. కరెంటు కోతలు లేవని చెపుతున్న నిరంతరం విద్యుత్ కోతలతో ఎండాకాలంలో ప్రజలు అల్లాడి పోతున్నారు …కేసీఆర్ ప్రభుత్వంలో రెప్పపాటులో కూడా కరెంటు పోలేదని ప్రజలే అంటున్నారు …అధికారంలోకి రాగానే 4 వేల పెన్షన్ ఇస్తామని మహిళలకు నెలకు 2500 రూపాయలు అందజేస్తామని , రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ వాటిని ప్రజలు అందించడంలో వైఫల్యం చెందింది …దీంతో ప్రజలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు …

Related posts

అధికారుల నిర్లక్ష్యణ భారీ నష్టానికి కారణం…సిసిఐ నేత భాగం హేమంతరావు

Ram Narayana

సెహబాష్ కలెక్టర్ గౌతమ్ గారు … పిల్లల చదువుల పట్ల చూపుతున్న శ్రద్ధకు హ్యాట్సప్ …

Ram Narayana

సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు ..

Ram Narayana

Leave a Comment