- ఏలియన్స్ కోసం విశ్వాన్ని జల్లెడ పడుతున్న శాస్త్రవేత్తలు
- కే2-18బీ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించిన శాస్త్రవేత్తలు
- ఆ జీవం ఏలియన్లే అయి ఉంటుందని భావన
- మన పురాతన సంస్కృతిలోనూ ఏలియన్ల ప్రస్తావన
విశ్వాన్ని జల్లెడ పడుతున్న శాస్త్రవేత్తలకు గ్రహాంతరవాసుల ఉనికి మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మారింది. వారసలు ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? వారు మనలాగే ఉంటారా? లేదంటే రూపంలో ఏదైనా తేడా ఉంటుందా? అన్న ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఏళ్ల తరబడి ఏలియన్స్‌పై పరిశోధనలు జరుగుతున్నప్పటికీ వారు పలానా గ్రహంపై ఉన్నారని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలేమీ లేవు. తాము ఫ్లయింగ్ సాసర్లు చూశామని, గ్రహాంతరవాసులను చూశామంటూ కొందరు చేస్తున్న వాదనలను కూడా ఎవరూ నిర్ధారించలేకపోయారు.
భూమిని పోలిన గ్రహాల కోసం, జీవం ఉనికి కోసం విశ్వంలో అన్వేషిస్తున్నశాస్త్రవేత్తలకు కే2-18బి ఎక్సో ప్లానెట్‌పై జీవం ఆనవాళ్లను గుర్తించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ జీవాన్ని గుర్తించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఆ జీవం గ్రహాంతరవాసులేనా? అన్న మరో ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది. లేదంటే ఇంకేమైనా అయి ఉంటుందా? అన్న ప్రశ్న శాస్త్రవేత్తల మెదళ్లను తొలిచేస్తోంది.
శాస్త్రవేత్తల పరిశోధనలను కాసేపు పక్కనపెడితే.. ఈ విశాల విశ్వంలో మానవుడు ఒంటరి కాదని హిందూ, మయాన్, ఈజిప్షియన్ సంస్కృతిలోనే చెప్పారు. వారు చెక్కిన చిత్రాల్లోనూ అవి స్పష్టంగా కనిపించాయి. అయితే వారిని దేవుళ్లగానో, వారి ప్రతినిధులుగానో, రాక్షసులుగానో చిత్రీకరించారు. ఏలియన్స్‌కు సంబంధించి మరిన్ని వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.