పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డిని గెలిపించాలని వద్దిరాజు విస్త్రత ప్రచారం …
ఇల్లందు , మణుగూరు , భద్రాచలంలలో పట్టభద్రులతో సమావేశాలు
బీఆర్ యస్ అభ్యర్థిగా రంగంలో ఏనుగుల రాకేష్ రెడ్డి
శాసనమండలికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో నల్లగొండ -ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ భద్రాచలం, ఇల్లందు , మణుగూరులలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో శుక్రవారం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు…పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా ఆధ్వర్యాన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పట్టభద్రులు హాజరయ్యారు.రాకేష్ రెడ్డిని గెలిపించాలని బీఆర్ యస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని వద్దిరాజు పేర్కొన్నారు …మంచి వ్యక్తి , పట్టభద్రుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకోని పోయే సమర్థుడైన వ్యక్తిని మండలికి ఎన్నుకోవాలని ఆయన కోరారు …ఇల్లందు లో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, దిండిగల రాజేందర్ , తదితరులు పాల్గొన్నారు ..మణుగూరు లో మాజీ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ యస్ అధ్యక్షులు రేగా కాంతారావు తదితరులు పాల్గొన్నారు …