థ్యాంక్స్ చెప్పిన భట్టివిక్రమార్క
- ఆయురారోగ్యాలతో, ప్రజలకు మరింత చేయాలంటూ రేవంత్ రెడ్డి ట్వీట్
- సదా కృతజ్ఞుడను అంటూ భట్టివిక్రమార్క స్పందన
- భట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు తెలిపిన మల్లు రవి
తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భట్టివిక్రమార్కతో కలిసి తాను ఉన్న ఫొటోను ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, ఆర్థిక, విద్యుత్ శాఖామాత్యులు భట్టివిక్రమార్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు ఆయురారోగ్యాలు, ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానం’టూ ట్వీట్ చేశారు.
తనకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. ‘హృదయపూర్వక ధన్యవాదాలు సీఎం గారు… సదా కృతజ్ఞుడను’ అని సీఎం ట్వీట్‌కు స్పందించారు. మల్లు భట్టివిక్రమార్క పుట్టినరోజు సందర్భంగా మల్లు రవి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.