Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

అమెరికాలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ నే దోచుకున్న దొంగ!

  • గన్ తో బెదిరించి బ్యాగ్ ఎత్తుకెళ్లిన దుండగుడు
  • తేరుకుని కాల్పులు జరిపిన ఏజెంట్
  • బైడెన్ పర్యటన సందర్భంగా కాలిఫోర్నియాలో ఘటన

అమెరికాలో ఓ దుండగుడు ఏకంగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ నే దోచుకున్నాడు.. కారు ఆపి గన్ తో బెదిరించి బ్యాగ్ ఎత్తుకెళ్లాడు. వెంటనే తేరుకున్న ఏజెంట్ ఆ దొంగపైకి కాల్పులు జరిపాడు. ప్రెసిడెంట్ జో బైడెన్ కాలిఫోర్నియా పర్యటన సందర్భంగా చోటుచేసుకుందీ ఘటన. అధ్యక్ష ఎన్నికల కోసం ప్రెసిడెంట్ బైడెన్ కాలిఫోర్నియాలోని టస్టిన్ లో ఫండ్ రైజింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బైడెన్ పర్యటన సందర్భంగా సెక్యూరిటీ ఏర్పాట్లలో స్థానిక పోలీసులతో పాటు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఓ ఏజెంట్ తన డ్యూటీ ముగిశాక కారులో ఇంటికి బయలుదేరాడు.

మార్గమధ్యంలో ఓ ఆగంతుకుడు కారు ఆపి గన్ తో ఏజెంట్ ను బెదిరించాడు. ఆపై కారులో ఉన్న బ్యాగ్ తీసుకుని ఉడాయించాడు. ఏజెంట్ తేరుకుని పారిపోతున్న దొంగపై కాల్పులు జరిపాడు. అయితే, దొంగ పట్టుబడలేదని సమాచారం. ఏజెంట్ కాల్పుల్లో దొంగ గాయపడ్డాడా? లేదా? అనేది కూడా తెలియరాలేదు. ఈ విషయంపై సీక్రెట్ సర్వీస్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. పోలీసులు మాత్రం టస్టిన్ లో ఓ ఏజెంట్ దోపిడికి గురయ్యారని, గన్ తో బెదిరించిన దుండగుడి గురించి గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు.

Related posts

అమెరికాలోని హవాయి దీవుల్లో దోమల ట్రీట్ మెంట్ …!

Ram Narayana

భారత్ ఓ ఆర్థికశక్తి.. కెనడా ప్రధాని వ్యాఖ్య

Ram Narayana

భూమ్మీద పోగవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో 60 శాతం ఆ 12 దేశాల నుంచే.. తాజా రిపోర్టులో వెల్లడి

Ram Narayana

Leave a Comment